బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar elections) తొలి విడత పోలింగ్ లో జేడీయూ అధినేత, సీఎం నీతీశ్ కుమార్,(CM Nitish Kumar) విపక్ష సీఎం అభ్యర్థి, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ సహా పలు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు ఓట్లు వేశారు. తన సొంత జిల్లా బఖియార్ పుర్ లోని మంజు సిన్హా ప్రాజెక్ట్ గర్ల్స్ హైస్కూల్ లో ఉదయం ముఖ్యమంత్రి నీతీశ్ ఓటు వేశారు. అనంతరం తన పూర్వీకుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడ నుంచి పాట్నాకు తిరిగి వెళ్లారు. ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి బాధ్యత అని నీతీశ్ కుమార్ ట్వీట్ చేశారు.
Read also: ప్రమాదమంటూ రూ.35.23 లక్షలు దోచిన సైబర్ నేరగాళ్లు

మా ప్రభుత్వమే వస్తుంది.. తేజస్వీ
పాట్న వెటర్నరీ కళాశాలలోని పోలింగ్(Bihar elections) బూత్ లో విపక్ష సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఆర్ జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, లాలూ సతీమణి రబ్రీదేవి, తేజస్వీ యాదవ్ సతీమణి రాజశ్రీ, ఇతర కుటుంబ సభ్యులు ఓట్లు వేశారు. ఓటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడకుండా లాలూ ప్రసాద్ యాదవ్ వెళ్లిపోయారు. కాగా తన ఇద్దరు కుమారులు (తేజస్వీ, తేజ్ ప్రతాప్)లకు నా ఆశీర్వాదాలు ఉంటాయని లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి మీడియాతో అన్నారు. కాగా తేజస్వీ మాత్రం తమ ప్రభుత్వమే వస్తుందని, 14వ తేదీన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: