ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ బీహార్(Bihar) పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్(Nitish Kumar) ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానం అందించిన నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు ఈ నెల 20న పాట్నాకు వెళ్లనున్నారు.
Read Also: Prashant Kishor : పార్టీ ఓటమికి నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను : ప్రశాంత్ కిషోర్

మంత్రి నారా లోకేశ్ ఎన్డీఏ కూటమి
ఇటీవల బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో, మంత్రి నారా లోకేశ్ ఎన్డీఏ కూటమి తరపున ప్రచారంలో యాక్టివ్‌గా పాల్గొన్నారు. ఎన్నికల సమయం లో ఆయన బీహార్ రాష్ట్రంలో పర్యటించి, ఎన్నో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని, అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో, నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని పంపిన ఆహ్వానం మేరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు మంత్రి లోకేశ్ పాట్నా వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని, నితీశ్ కుమార్‌ను అభినందించనున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: