బిహార్ అసెంబ్లీ ఎన్నికల 2025 (Bihar Assembly Elections) లో ప్రతిపక్ష మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ తన కుటుంబ కోట అయిన రాఘోపూర్ స్థానంలో మొదటి ట్రెండ్‌లలోనే ముందంజలో ఉన్నారు. రాఘోపూర్ఆర్జేడీకి బలమైన స్థానం. గతంలో, తేజస్వి యాదవ్ తండ్రి, ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్, అతని భార్య రబ్రీ దేవి ఈ స్థానం నుంచే పోటీ చేశారు.
Read Also: Bihar Assembly Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ 90
2015 నుండి తేజస్వి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక రాఘోపూర్‌లో ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ ముందంజలో కొనసాగుతుండగా, మహువాలో ఆయన సోదరుడు, జనశక్తి జనతా దళ్ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ ముందంజలో ఉన్నారు.
కాగా, బీహార్ ఎన్నికల అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయే కూటమి మరోమారు అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ 90 నుంచి100 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశాయి. ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: