బిహార్ అసెంబ్లీ ఎన్నికల 2025 ఫలితాల్లో (Bihar Assembly Elections) అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) (పీకే) స్థాపించిన ‘జన సురాజ్’ పార్టీ, తొలిసారి ఎన్నికల బరిలో దిగి గుర్తింపు పొందుతోంది.
Read Also: Bihar Assembly Elections: రాఘోపూర్‌లో తేజస్వీయాదవ్ ముందంజ!

నాలుగు సీట్లలో ఆధిక్యంలో ముందంజ
ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఘోరంగా విఫలమవుతుందని అంచనా వేసినప్పటికీ, , శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో (Bihar Assembly Elections) ఆ పార్టీ బలమైన ఆరంభాన్ని అందుకుంది. ప్రాథమిక ట్రెండ్స్ ప్రకారం జన సురాజ్ నాలుగు సీట్లలో ఆధిక్యంలో ముందంజలో ఉంది.శుక్రవారం ఉదయం 8:45 గంటల సమయానికి వెలువడిన తొలి రౌండ్ల ఫలితాల్లో జన సురాజ్ పార్టీ (Jana Suraj Party) నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
బీహార్‌లోని మొత్తం 243 స్థానాలకు గాను 239 స్థానాల్లో ఈ పార్టీ పోటీకి దిగింది. మరోవైపు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీ, చిరాగ్ పాశ్వాన్ పార్టీలతో కూడిన అధికార ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంతో విజయపథంలో దూసుకుపోతోంది.
జన సురాజ్ పార్టీ గెలిచే సీట్ల సంఖ్య పరిమితంగానే ఉన్నప్పటికీ, ఈ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష ‘మహాగఠ్‌బంధన్’ కూటమికి చెందిన కీలక ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా, పీకే పార్టీ పరోక్షంగా ఎన్డీఏ విజయానికి దోహదపడనుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: