దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలపై ఎన్నికల సంఘం తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రత్యేక సమగ్ర సవరణ (Special Integrated Revision – SIR) పేరిట ఓటరు జాబితాల తాజాకరణ ప్రక్రియను చేపట్టాలని ఇండియా ఎలక్షన్ కమిషన్ (ECI) ప్రకటించిన నేపథ్యంలో, ఇందులో ఉపయోగించే గుర్తింపు పత్రాల విషయంలో పలు వాదనలు, అపోహలు తలెత్తుతున్నాయి.ముఖ్యంగా ఆమోదయోగ్యమైన గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్ కార్డును మినహాయించాలనే అంశంపై వివాదం నడుస్తోంది. ఇలాంటి సమయంలోనే భారత విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సీఈఓ భువనేష్ కుమార్ (Bhuvanesh Kumar) సంచలన కామెంట్లు చేశారు. ఆధార్ ఎప్పుడూ మొదటి గుర్తింపు కార్డు కాదని తేల్చి చెప్పారు.ఓటరు జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (Special Intensive Revision – SIR) కోసం ఆమోద యోగ్యమైన 11 పత్రాల జాబితాను కూడా ఈసీ ఇప్పటికే వెల్లడించింది.
అయితే ఈ జాబితాలో సాధారణంగా ఉపయోగించే ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లు లేవు. పాస్‌పోర్ట్, బ్యాంక్ పాస్‌బుక్, సర్వీస్ ఐడెంటిటీ కార్డులు, రేషన్ కార్డు, పింఛను పత్రాలు, స్మార్ట్ కార్డులు, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్ కార్డులు, ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, ఫోటోతో కూడిన విద్యాసంస్థల సర్టిఫికెట్లు, స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో పాస్‌బుక్ వంటి పత్రాలను మాత్రమే ప్రస్తుతం అంగీకరిస్తున్నారు. అయితే ఆధార్ కార్డు (Aadhaar card) లను గుర్తింపు పత్రంగా పరిగణనలోకి తీసుకోకపోవడంపై వివాదం రాజుకుంది. ప్రజలు, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నాయి.ఇలాంటి సందర్భంలోనే యూఐడీఏఐ సీఈఓ భువనేష్ కుమార్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఆధార్ ఎప్పుడూ తొలి గుర్తింపు కార్డు కాదని చెప్పారు.ఆధార్ కార్డులకు క్యూఆర్ కోడ్‌ల ద్వారా అంతర్నిర్మిత భద్రతా విధానం ఉందని, దీని ద్వారా నకిలీలను గుర్తించవచ్చని కూడా వివరించారు.

ఈ యాప్ ద్వారా వాటిని చెక్ చేసి
ఫేక్ ఆధార్ కార్డుల సృష్టిని అడ్డుకునేందుకు మార్గాలు అన్వేషిస్తున్నామని అన్నారు. ఇకపై అన్ని కొత్త ఆధార్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉంటుందని, ఉడాయ్ రూపొందించిన ఆధార్ క్యూఆర్ స్కానర్ యాప్ ద్వారా స్కాన్ చేసి, వివిరాలను సరిపోల్చుకోవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ ఫేక్ ఆధార్ కార్డులు ఎవరైనా తయారు చేస్తే, ఈ యాప్ ద్వారా వాటిని చెక్ చేసి అడ్డుకోవచ్చన్నారు.అలాగే కొత్త ఆధార్ యాప్ (New Aadhaar App) అభివృద్ధి దశలో ఉందని యూఐడీఏఐ సీఈఓ భువనేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కొత్త యాప్ అందుబాటులోకి వస్తే, ఇక ప్రజలు ఆధార్ ఫిజికల్ కాపీలను పంచుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రస్తుతం మాస్క్ వెర్షన్ కీలకం కానుందని, వినియోగదారుల సమ్మతిని బట్టి ఆధార్ వివరాలను పూర్తి లేదా మాస్క్ ఫార్మాట్ లో పంచుకునే వీలు ఉంటుందని చెప్పారు.
యూఐడీఏఐ (UIDAI) భారతదేశంలో ఎప్పుడు ఏర్పాటైంది?
యూఐడీఏఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఆధార్ చట్టం – 2016 (Aadhaar Act, 2016) ప్రకారం, భారత ప్రభుత్వం ద్వారా 12 జూలై 2016న ఏర్పాటైన ఒక చట్టబద్ధ సంస్థ (Statutory Authority).
ప్రస్తుత యూఐడీఏఐ (UIDAI) సీఈఓ ఎవరు?
భువనేశ్ కుమార్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం UIDAI యొక్క ప్రధాన కార్యనిర్వాహక అధికారి (Chief Executive Officer – CEO)గా విధులు నిర్వహిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Yash Dayal: లైంగిక ఆరోపణల పై క్లారిటీ ఇచ్చిన ఆర్‌సీబీ పేసర్