బెంగళూరులో(Bengaluru Crime) యువతి మృతి కేసు నగరాన్ని కలిచివేసింది. రామమూర్తి నగర్ పరిధిలోని సుబ్రమణి లేఅవుట్‌లో అద్దెకు ఉంటున్న డీకే షర్మిళ అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందగా, పోలీసులు చేపట్టిన దర్యాప్తులో దారుణమైన నేరం వెలుగులోకి వచ్చింది.
Read Also: AP: నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ

అనుమానాస్పద మృతి కేసు వెనుక భయంకర నిజాలు
షర్మిళ నివసిస్తున్న ఫ్లాట్ పక్కనే ఉండే కర్నల్ కురయ్ అనే యువకుడు కొంతకాలంగా ఆమెపై కన్నేసి వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల 3వ తేదీన, ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కిటికీ మార్గంగా ఆమె ఇంట్లోకి చొరబడిన నిందితుడు, తన కోరికను తీర్చాలని బలవంతం చేశాడు. దీనికి షర్మిళ గట్టిగా నిరాకరించడంతో ఆగ్రహించిన కర్నల్ ఆమె నోరు, గొంతును బలంగా నులిమి పట్టుకున్నాడు. తీవ్ర ప్రతిఘటనలో ఆమె స్పృహ కోల్పోయింది. యువతి మరణించిందని భావించిన నిందితుడు, నేరాన్ని దాచిపెట్టేందుకు ఇంట్లో ఉన్న వస్తువులకు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు.
అయితే కొద్దిసేపటికి షర్మిళ మృతి(Bengaluru Crime) చెందినట్లు నిర్ధారణ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనకు దారితీసింది. నిందితుడిపై హత్య, లైంగిక దాడి ప్రయత్నం, ఆధారాలు నాశనం చేసిన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: