ప్రముఖ తెలుగు యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ (Bayya Sunny Yadav) అరెస్ట్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో సాగుతున్న దర్యాప్తులో సన్నీ పాకిస్థాన్‌లో ఉన్న సమయంలో అరెస్ట్ అయ్యారు. విదేశాల్లో ఉంటుండగానే తనపై లుక్‌అవుట్ నోటీస్ జారీ కావడంతో, ఆయన దుబాయ్ నుంచి నేరుగా పాక్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ సమాచారం భద్రతా సంస్థల దృష్టికి చేరడంతో, వెంటనే అరెస్ట్ చేశారు.
గతంలోనూ పాకిస్థాన్ పర్యటనలు
సన్నీ యాదవ్ ఇప్పటికే కనీసం ఐదుసార్లు పాకిస్థాన్‌కు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. సాధారణ యూట్యూబర్‌గా బయ్యా సన్నీ ప్రసిద్ధి చెందినా, అంతగా పాక్ పర్యటనలు ఎందుకు చేశారనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ ప్రయాణాల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటన్న అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
పాక్ స్పై జ్యోతి మల్హోత్రాతో సంబంధాలేనా?
ఇప్పటికే అరెస్టైన పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో కూడా సన్నీ పేరును పరిశీలిస్తున్నారు. ఆమెతో సన్నీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా సంస్థలు సన్నీ మొబైల్, కమ్యూనికేషన్ చరిత్రను విశ్లేషిస్తూ కీలక ఆధారాలను సేకరిస్తున్నాయి. త్వరలో ఈ కేసులో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
Read Also : Vallabhaneni Vamsi : వంశీకి బెయిల్