బెంగళూరులో(Banglore) ట్రాఫిక్ కష్టాలు ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో, నగర అభివృద్ధి అధికారులు పరిష్కారాల కోసం చర్యలు ప్రారంభించారు. రాత్రింబవళ్లు వాహన రద్దీతో బాధపడుతున్న ముఖ్య మార్గాల్లో ఫ్లైఓవర్ల విస్తరణ పనులు చేపట్టారు. ప్రత్యేకంగా, హైదరాబాద్, కేంపేగౌడ విమానాశ్రయం వైపు వెళ్లే మార్గాలలో ట్రాఫిక్ ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో హెబ్బాళ ఫ్లైఓవర్‌కు అదనపు లూప్‌లను నిర్మిస్తున్నారు.
Read Also: Nirmala Sitharaman: రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

హెబ్బాళ ఫ్లైఓవర్ (Banglore)విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నట్టు గ్రేటర్ బెంగళూరు అథారిటీ(Greater Bangalore Authority) అధికారులు వెల్లడించారు. షట్టరింగ్, రీఎన్‌ఫోర్స్‌మెంట్ వంటి నిర్మాణ కార్యకలాపాలు వేగంగా సాగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ పూర్తయితే నగర శివార్ల నుంచి లోపలి ప్రాంతాలకు ప్రయాణం మరింత సులభం అవుతుందని అధికారులు తెలిపారు.
అదే సమయంలో, బెంగళూరులో ట్రాఫిక్ నిర్వహణలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్‌ను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించేందుకు, డేటాను విశ్లేషించేందుకు ఎఆయ్ ఆధారిత “మొబిలిటీ డిజిటల్ ట్విన్” మోడల్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పోలీసు శాఖ కోటి రూపాయల వ్యయంతో టెండర్లు కూడా ఆహ్వానించింది.
ఈ మెరుగైన సాంకేతికత వల్ల నగర ట్రాఫిక్ స్థితిగతులను ముందుగానే విశ్లేషించి, అవసరమైన చర్యలు తీసుకునే వీలుంటుంది. ప్రపంచంలోని న్యూయార్క్, మాస్కో, బార్సిలోనా వంటి ప్రధాన నగరాల సరసన ఇప్పుడు బెంగళూరూ డిజిటల్ ట్విన్ టెక్నాలజీని ఉపయోగించనున్నది. దీంతో ట్రాఫిక్ జామ్‌లు తగ్గి, ప్రయాణాలు మరింత వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: