భారత పార్లమెంట్ సభ్యుడు గులామ్ నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) సౌదీలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. పాక్ ఉగ్రకార్యకలాపాలను అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు ఏర్పాటు చేసిన బహుళ దేశాల పర్యటనలో భాగంగా ఆయన సౌదీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన్ని రియాద్ నగరంలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన్ని ఉంచి పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వైద్యుల పర్యవేక్షణలో ఆజాద్
ఈ సందర్భంగా భారత బృందానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ ఎంపీ బైజయంత్ జయంత్ పాండా మీడియాతో మాట్లాడుతూ, “ఆజాద్ గారు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా పరీక్షిస్తున్నారు. బహ్రెయిన్, కువైట్ పర్యటనల్లో ఆయన చాలా కృషి చేశారు. ఆయన్ని సౌదీ, అల్జీరియా సమావేశాల్లో మిస్ అవుతాం” అని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం ఈ బృందం వివిధ దేశాల్లో పాకిస్థాన్ ఉగ్రకార్యకలాపాలను ప్రపంచ సమాజానికి వెల్లడించేందుకు కృషి చేస్తోంది.
గులామ్ నబీ ఆజాద్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిలషిస్తూ పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. త్వరలోనే ఆయన కోలుకొని మళ్లీ సక్రియంగా తన కార్యకలాపాలను కొనసాగించాలన్నది అందరి ఆకాంక్ష.
Read Also : Vijay Sethupathi : విజయ్ సేతుపతి సినిమాలో ఆ స్టార్ హీరో కూడా?