ASI Murder: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI) అరుణాబెన్ సతుభాయ్ జాదవ్‌ను ఆమె సహజీవన భాగస్వామి, CRPF కానిస్టేబుల్ దిలీప్ డాంగ్‌చియా హత్య చేశాడు.
ఘటన వివరాలు
ASI Murder: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అంజార్ పోలీస్ స్టేషన్‌లో (Anjar Police Station) ASIగా పనిచేస్తున్న అరుణాబెన్ సతుభాయ్ జాదవ్, 2021లో CRPF కానిస్టేబుల్ దిలీప్ డాంగ్‌చియాతో (Dilip Dongchia) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి, వారు గత నాలుగు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. త్వరలో వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. దిలీప్ ప్రస్తుతం మణిపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు.

గొడవలు, హత్యకు దారితీసిన కారణం
కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని ఇరుగుపొరుగు వారు తెలిపారు. శుక్రవారం రాత్రి, వివాహం చేసుకునే విషయంపైనే అరుణాబెన్, దిలీప్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో దిలీప్ ఆగ్రహం పట్టలేక అరుణాబెన్ గొంతుకోశాడు. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆమె అక్కడికక్కడే మరణించింది. దిలీప్ తన తల్లిని అరుణాబెన్ తీవ్రంగా దూషించడంతోనే కోపం వచ్చి చంపేశానని పోలీసుల విచారణలో వెల్లడించాడు.
లొంగుబాటు, తదుపరి చర్యలు
హత్య చేసిన తర్వాత, తెల్లవారుజామున దిలీప్ నేరుగా అరుణాబెన్ పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అరుణాబెన్ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Lucknow: లక్నోలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం