ఎప్పటికప్పుడు రైలు ప్రయాణికుల సౌలభ్యం కొరకు భారతీయ రైల్వే మార్పులు చేస్తూనే ఉంటుంది. తాజాగా శుక్రవారం జరిగిన రాజ్యసభ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) మహిళా రైలు ప్రయాణికులకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ప్రధానంగా లోయర్ బెర్త్ ఆటోమేటిక్‌గా 45 ఏళ్లు పైపడిన మహిళలు, వృద్ధులకు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
Read Also: Silver Price: సిల్వర్ మార్కెట్‌లో అసాధారణ డిమాండ్
కొన్ని బెర్తులను
సాధారణంగా రైళ్లలో వృద్ధులు , మహిళలకు మాత్రమే లోయర్ బెర్త్‌లు కేటాయిస్తారు. అయితే టికెట్ బుకింగ్ సమయంలో వారు బెర్త్ ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటి నుంచి బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్ ఎంచుకోకున్నాపెద్దలు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు మాత్రమే లోయర్ బెర్త్ భారతీయ రైల్వే కేటాయించనుంది.

స్లీపర్, 3AC బోగీల్లో కొన్ని బెర్తులను పెద్దలు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు కేటాయించినట్లు రాజ్యసభలో తెలియజేశారు. రైళ్లలో దివ్యాంగులు, సహాయకులకూ ఇలానే కొన్ని రిజర్వ్ చేసినట్లుకేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు (Ashwini Vaishnav).
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: