సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) ఈ రోజు గోవా గవర్నర్‌గా బాధ్యతలు (Responsibilities as Governor of Goa) స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనకు ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం అశోక్ గజపతిరాజు అధికారికంగా గవర్నర్‌గా బాధ్యతలు చేపడతారు.

ప్రమాణ స్వీకార వేడుకకు విశేష హాజరు
ఈ కార్యక్రమానికి ఏపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేశ్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరవుతున్నారు. గోవా ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీనియర్ అధికారులు కూడా పాల్గొననున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరవుతున్నారు.
గజపతిరాజు కుటుంబం గోవాకు చేరింది
ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం అశోక్ గజపతిరాజు భార్య సునీలా, కుమార్తె అదితి గజపతిరాజు, మరో కుమార్తె విద్యావతి దేవి నిన్న రాత్రే గోవాకు చేరుకున్నారు. కుటుంబంతో పాటు ఆయన సన్నిహితులు, టీడీపీ నేతలు కూడా అక్కడికి వెళ్లారు.గోవా విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అశోక్ గజపతిరాజుకు ఘన స్వాగతం పలికారు. ఈ వేడుక రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అశోక్ గజపతిరాజు ప్రాధాన్యం
అశోక్ గజపతిరాజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేతగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు. ఇప్పుడు గోవా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also : Tamil Nadu : పూజారికి కారం నీళ్లతో అభిషేకం