రాజస్థాన్ (Rajasthan) శ్రీగంగానగర్ జిల్లాలో(Army Soldier) సైనిక విన్యాసాల సందర్భంగా జరిగిన ప్రమాదం ఆరుగంటలపాటు ఉద్రిక్తతకు దారితీసింది. సాధారణ శిక్షణలో భాగంగా మంగళవారం ఉదయం ఆర్మీ బృందం ఇందిరా గాంధీ కాలువ పరిసర ప్రాంతాల్లో మెకనైజ్డ్ డ్రిల్ల్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భారీ బరువున్న యుద్ధ ట్యాంక్ కాలువను దాటే సమయంలో ఒక్కసారిగా లోతైన మట్టిలో ఇరుక్కుపోయి నీటిలోకి జారిపోయింది. ట్యాంకులో ఉన్న ఇద్దరు సైనికులు వెంటనే బయటపడేందుకు ప్రయత్నించారు. వారిలో ఒకరు పైకి ఈదుకుంటూ రక్షణ బృందాల సహాయంతో తీరానికి చేరుకోగలిగారు. అయితే మరొక సైనికుడు ట్యాంకు లోపల చిక్కుకుపోయాడు. ప్రవాహం ఎక్కువగా ఉండటం, నీటి లోతు పెరగడం కారణంగా ఆ సైనికుడిని ప్రత్యక్షంగా చేరుకోవడం కష్టమైంది.
Read also: ఆసిమ్ మునీర్ భారత్‌తో యుద్ధం కోరుకుంటున్నాడు : ఇమ్రాన్‌ఖాన్ సోదరి

గంటల తరబడి గాలింపు చర్యల తర్వాత మృతదేహం వెలికితీత
స్థానిక పోలీసులు,(Army Soldier) విపత్తు ప్రతిస్పందన దళం (DRF) వెంటనే చర్యల్లోకి దిగి, బోట్లు, డైవర్స్ సహాయంతో గంటల తరబడి గాలింపు చేపట్టారు. చివరకు ట్యాంకును భాగాలుగా విడదీసి లోపలికి ప్రవేశించిన రక్షకసిబ్బంది సైనికుడి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై ఇప్పటికే ఆర్మీ అంతర్గత దర్యాప్తు బృందం పని ప్రారంభించింది. అధికారులు ప్రకారం ట్యాంకు బరువు మరియు కాలువ పునాది బలహీనత వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రారంభ అంచనాలు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతా మార్గదర్శకాలను పునఃసమీక్షకు ఆదేశించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: