సంవత్సరం చివరి నెలల్లో లేదా కొత్త సంవత్సరం ప్రారంభంలో మొబైల్ యూజర్ల జేబులు మళ్లీ ఖాళీ అవబోతున్నాయి. రీఛార్జ్ (Recharge) ప్లాన్ల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. టెలికాం రంగంలో ఉన్న మూడు ప్రముఖ కంపెనీలు — రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel), వొడాఫోన్ ఐడియా (Vi) — టారిఫ్‌లను పెంచే ఆలోచనలో ఉన్నాయని సమాచారం.
Read Also: Paytm: పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
టారిఫ్ దాదాపు 10 శాతం పెరగవచ్చు.దీనిపై అధికారిక ప్రకటన చేయనప్పటికీ రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే వారి అనేక రీఛార్జ్ (Recharge) ప్లాన్‌లలో మార్పులు చేశాయి. కొన్ని ప్లాన్‌ల ధర పెంచబడింది. కొన్ని ప్లాన్‌ల చెల్లుబాటు కాలం తగ్గించారు. ఉదాహరణకు.. జియో 1GB రోజువారీ బేస్ ప్లాన్ ధర గతంలో రూ.249గా ఉండేది.

ఖర్చును సుంకాల పెంపునకు కారణం
ఇప్పుడు దానిని రోజుకు 1.5GBకి మార్చి రూ.299 ఛార్జ్ చేస్తున్నారు. ఎయిర్‌టెల్ బేస్ ప్లాన్ కూడా అదే విధంగా మారింది.5G నెట్‌వర్క్ నిర్మాణం, నిర్వహణ ఖర్చును సుంకాల పెంపునకు కారణంగా టెలికాం కంపెనీలు పేర్కొన్నట్లు తెలిసింది. ఫైబర్ విస్తరణ, స్పెక్ట్రం కోసం కూడా ఖర్చులు ఉన్నాయి. అందుకే సుంకం పెరిగే అవకాశం ఉంది.
ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది జూన్ మధ్య ఈ టారిఫ్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. జెపి మోర్గాన్ నివేదిక ప్రకారం.. జియో తన రీఛార్జ్ ప్లాన్‌ల ధరను 15 శాతం వరకు పెంచవచ్చు. ఎయిర్‌టెల్, Vi కూడా దీనిని అనుసరిస్తాయని భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: