యాపిల్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. ప్రపంచ టెక్ రంగంలో (Apple) భారతీయులు కీలక స్థానాలు దక్కించుకుంటున్న తరుణంలో, యాపిల్ కూడా అదే దిశలో అడుగులు వేసింది. ప్రముఖ ఏఐ నిపుణుడు అమర్ సుబ్రమణ్యను కంపెనీ కొత్త ఏఐ (AI) వైస్ ప్రెసిడెంట్‌గా నియమించింది. దశాబ్దాలుగా ఈ స్థానాన్ని దక్కించుకున్న జాన్ జియాన్నండ్రియాని పక్కకు తప్పించి అమర్‌కు బాధ్యతలు అప్పగించింది.
Read also: అపార్ట్‌మెంట్ విషయంలో హైకోర్టు కీలక తీర్పు

అమర్ సుబ్రమణ్య – ఏఐ రంగంలో దిగ్గజ ప్రయాణం
భారతీయ(Apple) మూలాలున్న అమర్ సుబ్రమణ్యకు AI రంగంలో విశేష అనుభవం ఉంది. యాపిల్‌లో చేరకముందు, ఆయన మైక్రోసాఫ్ట్‌లో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ AIగా పని చేశారు. అంతకుముందు గూగుల్‌లో 16 ఏళ్లపాటు సేవలందించారు. ముఖ్యంగా జెమినీ అసిస్టెంట్ ఇంజినీరింగ్ హెడ్‌గా కీలక పాత్ర పోషించారు.
యాపిల్‌లో అమర్ పర్యవేక్షించే ముఖ్య విభాగాలు:
- ఫౌండేషన్ మోడల్స్ అభివృద్ధి
- మెషీన్ లెర్నింగ్ పరిశోధన
- ఏఐ సేఫ్టీ & ఎవాల్యుయేషన్
Apple CEO టిమ్ కుక్ అమర్‌ను స్వాగతిస్తూ, AI ఎప్పుడూ ఆపిల్ వ్యూహంలో కేంద్రంగా ఉంది. అమర్ నాయకత్వం కంపెనీ భవిష్యత్తు ఏఐ లక్ష్యాలకు మరింత బలాన్నిస్తుంది అని పేర్కొన్నారు. యాపిల్ త్వరలోనే మరింత శక్తివంతమైన, ఏఐ ఇంటిగ్రేటెడ్ సిరి వెర్షన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అమర్ నియామకం ఆపిల్‌కు కీలక మలుపుగా భావిస్తున్నారు. ఆయన అనుభవం ‘Apple Intelligence’ లక్ష్యాలను అమలు చేయడంలో ముఖ్య పాత్ర పోషించనుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: