దేశంలో ఓట్ చోరీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం సాయంతో ఓట్ల చోరీకి పాల్పడి బీజేపీ అధికారంలోకి వచ్చిందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ, ఈసీపై రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. కర్నాటక, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఈసీ తీవ్ర అక్రమాలకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. ఓట్ల చోరీతో భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నవారిని ఎన్నికల సంఘం రక్షిస్తోందని విమర్శించారు. రాహుల్ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

రాహుల్ తన నిరాధారమైన ఆరోపణలతో దేశంలో బంగ్లాదేశ్, నేపాల్ తరహా పరిస్థితులను సృష్టించాలనుకుంటున్నారంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ (Anurag Thaku) విమర్శలు గుప్పించారు. ‘రాహుల్ నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం పక్షపాతం లేకుండా పనిచేస్తుంటే.. రాహుల్ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. పౌరులను తప్పుదారి పట్టిస్తున్నారు. దేశంలో బంగ్లాదేశ్, నేపాల్ తరహా పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని అనురాగ్ ఠాకూర్ (Anurag Thaku) విమర్శించారు. ‘రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 90 ఎన్నికల్లో ఓడిపోయింది. దీంతో ఆయనలో నిరాశ రోజురోజుకూ పెరుగిపోతోంది. అలాగే గెలుపుపై రాహుల్ గాంధీకి నమ్మకం పోయింది. ఆరోపణల రాజకీయాలను రాహుల్ తన అస్త్రంగా మార్చుకున్నారు. తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారింది. క్షమాపణ కోరడం, కోర్టుల నుంచి మందలింపులు పొందడం రాహుల్‌కు నిత్యకృత్యంగా మారింది’ అని ఎంపీ అనురాగ్ ఠాకూర్ (Anurag Thaku)ఎద్దేవా చేశారు.
అనురాగ్ ఠాకూర్ ఎవరు?
కెప్టెన్ అనురాగ్ సింగ్ ఠాకూర్ (జననం 24 అక్టోబర్ 1974) భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్ నుండి లోక్సభలో పార్లమెంటు సభ్యుడు. ఆయన రెండవ మోడీ మంత్రివర్గంలో క్రీడలు, యువజన వ్యవహారాలు మరియు సమాచార మరియు ప్రసార మంత్రిగా పనిచేశారు.
అనురాగ్ ఠాకూర్ను బీసీసీఐ ఎందుకు తొలగించింది?
ప్రమాణ స్వీకారంలో అబద్ధం చెప్పారనే ఆరోపణలతో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ను సుప్రీంకోర్టు ఈరోజు తొలగించింది. అనురాగ్ ఠాకూర్‌కు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసు కూడా జారీ చేసింది. బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కేను కూడా సుప్రీంకోర్టు తన పదవి నుంచి తొలగించింది.
బీసీసీఐని స్థాపించింది ఎవరు?
డిసెంబర్ 10, 1927న, తాత్కాలిక నియంత్రణ మండలి ఏర్పాటుకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకోబడింది మరియు డిసెంబర్ 1928లో BCCI ఏర్పడింది . RE గ్రాంట్ గోవన్ దాని మొదటి అధ్యక్షుడిగా మరియు ఆంథోనీ డి మెల్లో కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: