हिन्दी | Epaper

Bangladesh: భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

Vanipushpa
Bangladesh: భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమ నేత షరీఫ్ ఉస్మాన్ హాడీ(Sharif Osman Hadi) సింగపూర్‌లో చికిత్స పొందుతూ మరణించారు. గత వారం ఢాకాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హాడీకి ఢాకాలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సింగపూర్ తరలించారు. ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. ఈ మేరకు సింగ్‌పూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ హాడీ మరణాన్ని ధ్రువీకరించింది. హాడీ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హాడీ మరణంతో బంగ్లాదేశ్‌లో మరోసారి నిరసనలు మిన్నంటాయి.

Read Also: Google Gemini AI: ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

Bangladesh
Bangladesh

విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించిన ఉస్మాన్ హాడీ

గత ఏడాది జులై ఆగస్టులో జరిగిన బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమంలో హాడీ కీలక పాత్ర పోషించాడు. ఈ ఉద్యమం 15 ఏళ్ల షేక్ హసీనా పాలనకు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ‘ఇంక్విలాబ్ మంచా’ అనే విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించిన ఉస్మాన్ హాడీ.. వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 32 ఏళ్ల విద్యార్థి నేత1994లో జన్మించారు. భారత్‌ పట్ల ద్వేషం ప్రదర్శించేవాడని.. ‘గ్రేటర్ బంగ్లాదేశ్’ పేరుతో భారత భూభాగాలను కలిపి కొత్త మ్యాప్‌లు రూపొందించిన ప్రచారం చేశారని వార్తలు వచ్చాయి. డిసెంబర్ 12న ఢాకాలోని పాల్టన్ ప్రాంతంలో హాడీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆయన తలకు గాయం కాగా.. మొదట ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి, ఆ తర్వాత ఎవరెస్ట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయనను సింగపూర్‌కు తరలించింది. హాడీ హంతకుల కోసం బంగ్లాదేశ్ పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు ఇద్దరు అనుమానితుల ఫోటోలను విడుదల చేసిన పోలీసులు.. వారి గురించి ఆచూకీ ఇస్తే 5 మిలియన్ టాకాలు (సుమారు 42,000 డాలర్లు) రివార్డు ప్రకటించారు. సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

1,900 మంది ఇరాన్ సైనికులను చంపేశాం!

1,900 మంది ఇరాన్ సైనికులను చంపేశాం!

ఇరాన్‌ యుద్ధంతో పాక్‌లో తీవ్ర సంక్షోభంతో విలవిలా

ఇరాన్‌ యుద్ధంతో పాక్‌లో తీవ్ర సంక్షోభంతో విలవిలా

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం, టికెట్ ధరలు ఆకాశంలో

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం, టికెట్ ధరలు ఆకాశంలో

ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది- ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది- ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష

విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

📢 For Advertisement Booking: 98481 12870