हिन्दी | Epaper

AI: బెంగళూరులో కార్యాలయాన్ని ప్రారంభించిన Anthropic

Vanipushpa
AI: బెంగళూరులో కార్యాలయాన్ని ప్రారంభించిన Anthropic

ఇంటర్నేషనల్ కృత్రిమ మేధస్సు (AI) రంగంలో వేగంగా ఎదుగుతున్న ప్రముఖ సంస్థ Anthropic భారత మార్కెట్‌లో అడుగుపెట్టింది. 2026 ఫిబ్రవరి 16న బెంగళూరులో తన కొత్త కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఇది కంపెనీ గ్లోబల్ విస్తరణ వ్యూహంలో ఒక కీలక మైలురాయిగా చెప్పవచ్చు. ముఖ్యంగా Claude అనే Anthropic యొక్క ప్రముఖ AI అసిస్టెంట్‌కు భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద యూజర్ మార్కెట్‌గా అవతరించడంతో.. ఈ కార్యాలయం భారత టెక్ ఎకోసిస్టంలో సంస్థ పాత్రను మరింత విస్తరించనుంది. ఈ కొత్త కార్యాలయం ద్వారా Anthropic భారతదేశంలో ఎంటర్ప్రైజ్, విద్య, వ్యవసాయం, డిజిటల్ సేవలు వంటి విభిన్న రంగాల్లో తన కార్యకలాపాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా బాధ్యతాయుత AI (Responsible AI) అభివృద్ధి, వినియోగంపై సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది.

Read Also: Bangladesh: తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!

AI: బెంగళూరులో కార్యాలయాన్ని ప్రారంభించిన Anthropic
AI: బెంగళూరులో కార్యాలయాన్ని ప్రారంభించిన Anthropic

AIని కేవలం ఉత్పాదకత పెంచే సాధనంగా మాత్రమే కాకుండా, సమాజానికి మేలు చేసే విధంగా వినియోగించాల్సిన అవసరం ఉందని Anthropic భావిస్తోంది. ఈ దిశగా భారత మార్కెట్‌లో సురక్షితమైన, నమ్మకమైన AI పరిష్కారాలను అందించేందుకు ఈ విస్తరణ ఉపకరిస్తుందని కంపెనీ తెలిపింది. బెంగళూరు కార్యాలయం.. టోక్యోలో ఉన్న కార్యాలయం తర్వాత Anthropic రెండవ ఆసియా కార్యాలయంగా పనిచేయనుంది. దీనికి నాయకత్వం వహించేందుకు భారత విభాగ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఇరినా ఘోష్ నియమితులయ్యారు. ఆమె నాయకత్వంలో ఈ కార్యాలయం భారతదేశంలో స్థానిక ప్రతిభను నియమించుకుని, స్టార్ట్-అప్స్, పెద్ద సంస్థలు, టెక్ సర్వీస్ కంపెనీలతో కలిసి AI ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేసే కేంద్రంగా మారనుంది. భారత డెవలపర్లు, ఇంజినీర్లతో కలిసి పనిచేయడం ద్వారా, స్థానిక అవసరాలకు అనుగుణమైన సాంకేతిక పరిష్కారాలను రూపొందించాలన్నది Anthropic లక్ష్యం. AI రాకతో ప్రపంచం పెను ప్రమాదంలో ఉంది.. సంచలన లేఖతో ఆంత్రోపిక్ సేఫ్‌గార్డ్స్ చీఫ్ మృణాంక్ శర్మ రాజీనామా.. భారత మార్కెట్‌లో Anthropic ఇప్పటికే అనేక కీలక భాగస్వామ్యాలను ప్రకటించింది.

ఖర్చులను కూడా తగ్గించుకునే ప్రయత్నం

ఎయిర్ ఇండియా సంస్థ Claude Codeను ఉపయోగించి కస్టమ్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా.. ఖర్చులను కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే CRED సంస్థ Claudeను వినియోగించి తన ఉత్పత్తి ఫీచర్ల డెలివరీని రెట్టింపు వేగంతో చేయగలిగింది, అలాగే టెస్టింగ్ కవరేజ్‌ను సుమారు 10 శాతం వరకు మెరుగుపరిచింది. మరోవైపు Cognizant సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3.5 లక్షల మందికి పైగా ఉద్యోగులకు Claude ఆధారిత AI టూల్స్‌ను అందిస్తూ ఉత్పాదకతను పెంచుతోంది. సంస్థ తన రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు Claudeను ఇంటిగ్రేట్ చేయగా.. Enterpret, Emergent వంటి స్టార్ట్-అప్స్ AI అసిస్టెంట్‌ల సహాయంతో తమ వ్యాపారాన్ని వేగంగా విస్తరించాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

తరుణ్ హత్యతో భగ్గుమన్న ఢిల్లీ.. రంగంలోకి బుల్డోజర్లు

తరుణ్ హత్యతో భగ్గుమన్న ఢిల్లీ.. రంగంలోకి బుల్డోజర్లు

యుద్ధంపై కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన

యుద్ధంపై కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం..విలవిలలాడుతున్న పలు దేశాలు

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం..విలవిలలాడుతున్న పలు దేశాలు

📢 For Advertisement Booking: 98481 12870