ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ(Anil Ambani)కి చెందిన రిలయన్స్ గ్రూప్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో పెద్ద చర్య తీసుకుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) పరిధిలో కొనసాగుతున్న విచారణలో భాగంగా, దాదాపు రూ. 1,400 కోట్ల విలువైన ఆస్తులను ప్రొవిజనల్‌గా అటాచ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ. 9,000 కోట్లకు చేరింది.
Read Also: RRB NTPC Railway Jobs 2025: రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

స్వాధీనం చేసుకున్న ఆస్తులు
ఈడీ తాజాగా స్వాధీనం చేసుకున్న ఆస్తులు నవీ ముంబై, చెన్నై, పుణే, భువనేశ్వర్ ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీల్లో జరిగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ఈడీ కొంతకాలంగా దర్యాప్తు చేస్తోంది. అదే పరిశీలనలో భాగంగా తాజా అటాచ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ కేసులో గతంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రూ. 7,500 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదనంగా రూ.1,400 కోట్ల ఆస్తుల అటాచ్‌తో విచారణ వేగం పెరిగిందని భావిస్తున్నారు. జప్తు చేసిన ఆస్తుల స్వరూపం, అవినీతికి వాటికి ఉన్న సంబంధం వంటి అంశాలపై ఈడీ త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందని వర్గాలు సూచిస్తున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: