ఇటీవలి కాలంలో మూగజీవాలపై చాలామందికి ప్రేమ పెరిగింది. వాటిని ఇంట్లో కుటుంబసభ్యులలాగా చూసుకుంటున్నారు. పక్షులు, కుందేళ్లు, తాబేళ్లు, కుక్కలు, పిల్లులు ఇలా ఒక్కటేమిటి ఇప్పుడు చాలా మంది అనేక జంతుజీవాలను తమ ఇంట్లోనే పెంచుకుంటున్నారు. వాటికి ఆలనా పాలనా చేస్తూ తమ ఒత్తిడి లైఫ్ నుంచి విశ్రాంతి పొందుతున్నారు. అయితే కొంతమంది ఆకతాయిలు మాత్రం మూగజీవాలపై దాష్టికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. వాటిపై కర్కశంగా వ్యవహరిస్తున్నారు. నోరు లేని జీవాలను నానా రకాలుగు ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కొందరు వ్యక్తులు ఏనుగు(Elephant)ను ఇబ్బంది పెడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజెన్లు ఆ వ్యక్తిపై మండిపడుతున్నారు.
Read Also: Starlink: భూమిపై రాలిపోతున్న స్టార్‌లింక్ శాటిలైట్స్..భూ కక్ష్య భద్రతకు ముప్పు
ఆకతాయిలపై కేసు నమోదు చేయాలని డిమాండ్
పశ్చిమ బెంగాల్ లోని మేదిని పుర్ లో జరిగిన షాకింగ్ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కొంతమంది ఆకతాయిలు ఓ ఏనుగుతో అసభ్యంగా ప్రవర్తించారు. ఏనుగు తోక పట్టుకుని లాగుతూ దానికి ఇబ్బంది కలిగించారు. ఏనుగుకు రాళ్లు వేస్తూ.. కర్రలు విసిరేస్తూ ఇబ్బంది పెట్టారు. దానికి హాని కలిగిస్తూ రాక్షసానందం పొందారు. గట్టిగా అరుస్తూ వాటి ప్రశాంతతకు భంగం కలిగించారు. తన దారిన తాను పోతున్న గజరాజుపై ఇలా కర్కశంగా ప్రవర్తించింది ఓ అల్లరి మూక. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై నెటిజెన్లు మండిపడుతున్నారు. జంతువులను వేధించిన చట్టం కింద ఆకతాయిలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏనుగులు ఏమి తింటాయి?
ఏనుగులు నిజంగా వేరుశెనగలు తింటాయా? - A-Z జంతువులు
ఏనుగులు గడ్డి, ఆకులు, వేర్లు, పండ్లు మరియు చెట్ల బెరడుతో సహా అనేక రకాల మొక్కలను తినే శాకాహార జంతువులు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: