అనిల్ అంబానీ(Anil Ambani) ముకేష్ అంబానీ ఇద్దరు సోదరులు. కానీ ముకేష్ అంబానీ(Mukesh Ambani) తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన ఒకరుగా ఉన్నారు. ఆయన వ్యాపారం దినదినపరివర్తన, మూడుపువ్వులు ఆరుకాయల్లా వర్థిల్లుతున్నది. కానీ అనిల్ అంబానీ మాత్రం తన పారంలో పలు ఒడుదుడుకులను చవిచూస్తున్నారు. ఆర్థిక భారంతో ఆయన ప్రభావం సన్నగిల్లిపోతున్నది. ఆయన నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ 2006 నుండి కంపెనీల నుండి నిధులను మళ్లించడం ద్వారా రూ. 41,921 కోట్లకు పైగా భారీ ఆర్థిక మోసానికి పాల్పడిందని దర్యాప్తు మీడియా సంస్థ కోబ్రాపోస్ట్ ఆరోపించింది.
Read also : Indiramma illu update : ఇందిరమ్మ ఇండ్ల పథకం నిలిచిపోయిందా? లబ్ధిదారుల ఆందోళనలు
కోబ్రాపోస్ట్ దర్యాప్తు నివేదిక ప్రకారం, రిలయన్స్ కమ్యూనికేషన్స్
రిలయన్స్ క్యాపిటల్ వంటి లిస్టెడ్ గ్రూప్ కంపెనీల నుండి బ్యాంకు రుణాలు ఆర్థిక సంస్థలకు మళ్లించబడ్డాయి. ఐపిఒల ద్వారా దాదాపు రూ.28,874 కోట్లు సేకరించబడ్డాయి.

ఆర్థిక అవకతవకలు రిలయన్స్ గ్రూప్ పై వచ్చిన మోసపూరిత ఆరోపణల్లో అతి ముఖ్యమైనది విదేశీ దేశాలను ఉపయోగించి ఆర్థిక అవకతవకలకు పాల్పడటం, అంటే రిలయన్స్ గ్రూప్ నేరుగా డబ్బు తీసుకురాలేదు కానీ సింగపూర్, మారిషన్, బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ వంటి అనేక దేశాలలో పనిచేస్తున్న దాని అనుబంధ సంస్థలు, షెల్ కంపెనీల ద్వారా డబ్బు లావాదేవీలు చేసింది.
దీని ద్వారా దాదాపు 1,535 బిలియన్ యుఎస్ డాలర్లు (భారతీయు కరెన్సీలో సుమూరు రూ.13,045 కోట్లు) మొత్తాన్ని లెక్కలు ఏకుండా అక్రమంగా భారతదేశంలోకి తీసుకువచ్చారని కోప్రాపోస్ట్ ఆరోపించింది. రిలయన్స్ ఇన్ ఫాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ వంటి గ్రూప్ కంపెనీలు తమ షేర్ల ట్రేడింగ్ లో జరిగిన అవతవకలపై దర్యాప్తు కోరుతూ సెబీకి ఫిర్యాదులు చేశాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read also :