हिन्दी | Epaper
ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌

Amit Shah : మమతా ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన అమిత్‌ షా

Sudha
Amit Shah :  మమతా ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన అమిత్‌ షా

పశ్చిమ బెంగాల్‌ లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అవినీతి, భయం, చొరబాట్లతో బెంగాల్‌ నిండిపోయిందని.. ఇది రాష్ట్ర భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తోందని ఆరోపించారు. కోల్‌కతాలో విలేకరుల సమావేశంలో షా మాట్లాడుతూ.. 15 ఏండ్ల తృణమూల్‌ పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ‘గత 15 ఏండ్లుగా బెంగాల్‌ భయం, అవినీతి, దుష్పరిపాలనను చూసింది. చొరబాట్లు ప్రజల్లో అభద్రతా భావాన్ని, ఆందోళనను సృష్టించాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయింది’ అని అమిత్‌ షా (Amit Shah)వ్యాఖ్యానించారు.

Read Also : http://Rajanth Singh: ₹79 వేల కోట్ల ఆధునిక ఆయుధాల కొనుగోలు

Amit Shah
Amit Shah

దీదీ నేతృత్వంలోని ప్రభుత్వ అవినీతి కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బెంగాల్‌కు తిరిగి పూర్వవైభవం తెస్తామని.. స్వామి వివేకానంద, బంకిం చంద్ర చటోపాధ్యాయ, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఊహించిన బెంగాల్‌ను నిర్మించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870