జమ్మూకశ్మీర్‌కు తగిన సమయంలో రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amithsha) హామీ ఇచ్చారు. లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంత ప్రజలు లేవనెత్తిన డిమాండ్లకు మంచి పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. పట్నాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన అమిత్ షా, జమ్మూకశ్మీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. “ఆర్టికల్ 370 రద్దు తరువాత, ఉగ్రవాద ప్రభావిత జమ్మూకశ్మీర్ మంచి మలుపు తీసుకుంది. గత తొమ్మిది నెలల్లో ఒక్క స్థానిక వ్యక్తి కూడా ఉగ్రవాద గ్రూప్‌లో చేరలేదు. 1990ల నుంచి వేర్పాటువాదం చెలరేగుతూ ఉన్న జమ్మూకశ్మీర్‌లో చూసిన గుణాత్మక మార్పు ఇది.
Read Also: Ashwini Vaishnav: గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్

జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం
గతంలో పాకిస్థాన్ మన సరిహద్దుల్లోకి వారి ఉగ్రవాదులను పంపాల్సిన అవసరం లేదని భావించేది. పాక్ మన పిల్లల చేతుల్లో ఆయుధాలు ఉంచి, మనకే వ్యతిరేకంగా పనిచేసేలా చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జమ్మూకశ్మీర్ ప్రజలు తాము భారతదేశం మొత్తానికి చెందిన వారమని, దేశం మొత్తం తమదని భావిస్తున్నారు. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది. ఇప్పటికే పంచాయితీ, మున్సిపల్, శాసనసభ ఎన్నికలు కూడా జరిగాయి. రాజ్యసభ ఎన్నికలు కూడా కొంతకాలం తరువాత జరుగుతాయి.” అని అమిత్ షా అన్నారు
తగిన సమయంలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా
ప్రమాణ స్వీకారం చేసి ఏడాది గడిచినా రాష్ట్ర హోదా పునరుద్ధరించకపోవడంపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై కూడా అమిత్ షా స్పందించారు. “అతను (ఒమర్ అబ్దుల్లా) రాజకీయపరమైన ఒత్తిడి వల్ల అలా చెబుతుండవచ్చు. కానీ జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా తగిన సమయంలో పునరుద్ధరించబడుతుంది. అది కూడా అతనితో చర్చల తర్వాతనే జరుగుతుంది” అని అమిత్ షా స్పష్టం చేశారు.
న్యాయమైన డిమాండ్లు పరిష్కారం
మరోవైపు లద్ధాక్‌లో ఇటీవల జరిగిన ఆందోళనల గురించి అమిత్ షా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం “లేహ్, కార్గిల్ కమిటీలతో చర్చలు” జరుపుతోందని అన్నారు. “ప్రజలు కాస్త ఓపికగా ఉండాలని మేము కోరుతున్నాం. వారి న్యాయమైన డిమాండ్లు అన్నింటికీ మంచి పరిష్కారం లభిస్తుంది” అని పేర్కొన్నారు. లద్ధాక్ రాజకీయ, పౌర సమాజాలకు ప్రాతినిధ్యం వహించే లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్ సంయుక్త నాయకత్వంను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అమిత్ షా నియోజకవర్గం?
గుజరాత్ రాజధాని గాంధీనగర్. ఇది భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, మాజీ ఉప ప్రధాన మంత్రి ఎల్.కె. అద్వానీ మరియు ప్రస్తుత హోం మంత్రి మరియు మాజీ బిజెపి చీఫ్ అమిత్ షా దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: