India Naxalism Deadline : దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాయ్‌పూర్‌లో జరుగుతున్న డిజీపీ–ఐజీపీ వార్షిక సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాబోయే డిజీపీ–ఐజీపీ సమావేశం నాటికి భారత్ నక్సలిజం సమస్య నుంచి పూర్తిగా విముక్తి పొందుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సమగ్ర చర్యల వల్ల ఎడమపక్ష తీవ్రవాదం తీవ్రంగా బలహీనపడిందన్నారు.
కేంద్రం గత ఏడు ఏళ్లలో 586 ఫోర్టిఫైడ్ పోలీస్ స్టేషన్లను నిర్మించిందని తెలిపారు. దీని ఫలితంగా 2014లో 126గా ఉన్న నక్సలీ ప్రభావిత జిల్లాల సంఖ్య ప్రస్తుతం కేవలం 11కి తగ్గిందన్నారు.
Cyclone Impact: తుఫాన్ తాకిడి భయం… విద్యార్థుల భద్రతపై ప్రశ
నక్సలిజం, డ్రగ్స్ వ్యాపారం, సంఘటిత నేరాలపై ప్రభుత్వం 360 డిగ్రీల దాడి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. “డ్రగ్ మాఫియా, నేరగాళ్లకు దేశంలో ఒక్క అంగుళం స్థలం కూడా ఇవ్వకూడదు అన్న విధంగా వ్యవస్థ ఉండాలి” అని ఆయన అన్నారు.
భారతీయ విద్యా సంస్థ ఐఐఎం – రాయ్‌పూర్‌లో జరుగుతున్న (India Naxalism Deadline) ఈ 60వ డిజీపీ–ఐజీపీ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్ డెకా సహా కేంద్ర భద్రతా సంస్థల అధిపతులు హాజరుకానున్నారు. ఈ సమావేశాల్లో ప్రధాని మోదీ రెండు రోజుల పాటు పాల్గొననున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/