దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికులకు ముఖ్యమైన సూచనలు చేశారు. నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు మరియు పునర్నిర్మాణ కార్యక్రమాల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ప్రయాణించే వారు, ముందుగా తమ ప్రయాణ ప్రణాళికలను సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. ఈ నిర్ణయం ఆగ్నేయ రైల్వే చక్రధర్‌పూర్ డివిజన్‌లో ఝార్సుగూడ గూడ్స్ యార్డ్ పునర్నిర్మాణంతో సంబంధం కలిగి ఉంది. రద్దు అయిన రైళ్ల వివరాలు ముందుగానే విడుదల చేసినందున, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
రద్దయిన రైళ్ల తేదీలు ఇవే
రద్దయిన కొన్ని కీలక రైళ్లు ఇలా ఉన్నాయి: దర్భంగ-చర్లపల్లి (17008) రైలు ఆగస్టు 29, సెప్టెంబర్ 12 తేదీల్లో రద్దు. చర్లపల్లి-దర్భంగ (17007) రైలు సెప్టెంబర్ 9న రద్దు. హైదరాబాద్-రాక్సౌల్ (17005) రైలు ఆగస్టు 21, 28న రద్దు కాగా, రాక్సౌల్-హైదరాబాద్ (17006) రైలు ఆగస్టు 24, 31న రద్దు. అంతేకాకుండా వాస్కోడగామా-జసిది (17321) ఆగస్టు 22, జసిది-వాస్కోడగామా (17322) ఆగస్టు 25న రద్దు అయ్యాయి. మరోవైపు చర్లపల్లి-రాక్సౌల్ (07051) ఆగస్టు 30, రాక్సౌల్-చర్లపల్లి (07052) సెప్టెంబర్ 2, చర్లపల్లి-రాక్సౌల్ (07005) సెప్టెంబర్ 1, రాక్సౌల్-చర్లపల్లి (07006) సెప్టెంబర్ 4, హెచ్.ఎస్. నాందేడ్-సంత్రగచి (12767) సెప్టెంబర్ 8, సంత్రగచి-హెచ్.ఎస్. నాందేడ్ (12768) సెప్టెంబర్ 10న రద్దు అవుతాయని అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ – మారిన రైల్ మార్గాలు
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆధునీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈ స్టేషన్‌కి వచ్చేవీ, బయలుదేరేవీ అయిన పలు రైళ్ల రాకపోకల్లో తాత్కాలిక మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని రైళ్లను చర్లపల్లి, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లకు దారి మళ్లించడం జరిగింది. ప్రయాణికులు తమ టికెట్లను బుకింగ్ చేసుకోవడానికన్నా ముందు రైల్వే అధికారిక వెబ్‌సైట్, యాప్‌లు లేదా హెల్ప్‌లైన్ నెంబర్లు ద్వారా తాజా సమాచారం తెలుసుకొని ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also : Trump Announces 25% Tariffs on India : భారత్‌పై ట్రంప్ సుంకాల మోత