ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ప్రముఖ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ)లో నిన్న రాత్రి దారుణమైన సంఘటన జరిగింది. (Aligarh Muslim University) గుర్తుతెలియని దుండగులు ఓ పాఠశాల ఉపాధ్యాయుడిని తుపాకీతో కాల్చి హత్య చేశారు. ఈ ఘటనతో క్యాంపస్‌లోని విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Read Also: AmitShah: త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే

హత్యకు గురైన వ్యక్తి వివరాలు
ప్రస్తుతం, హత్యకు గురైన వ్యక్తిని డానిష్ (43) గా గుర్తించారు. డానిష్ ఏఎంయూ మాజీ విద్యార్థి కాగా, గత 11 సంవత్సరాలుగా ఏబీకే హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం రాత్రి 8:50 గంటలకు డానిష్, ఆయన ఇద్దరు సహోద్యోగులతో కలిసి క్యాంపస్‌లో వాకింగ్‌కి వెళ్లారు. (Aligarh Muslim University) మౌలానా ఆజాద్ లైబ్రరీ సమీపంలోని క్యాంటీన్ వద్దకు చేరుకున్నప్పుడు, స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు ముసుగు దుండగులు వారిని అడ్డగించి, డానిష్‌పై పక్క దగ్గర నుంచి కాల్పులు జరిపారు. తలపై రెండు సార్లు, మొత్తం మూడు సార్లు కాల్చడంతో డానిష్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో సంబంధించి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఎస్ఎస్‌పీ నీరజ్ జదౌన్, ఇతర పోలీసు అధికారుల సమక్షంలో ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసును త్వరలో ఛేదించాలని వారు చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: