అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై రష్యా నుండి చమురు దిగుమతులపై అదనపు సుంకాలు విధించాలని హెచ్చరించారు. అమెరికా-భారత సంబంధాల విషయంలో ఇది ఒక కీలక సమస్యగా మారింది. ట్రంప్ ప్రకారం, రష్యా మీద పెట్టిన నిషేధాలు పాటిస్తూ, ఇతర దేశాలు రష్యా చమురు కొనుగోలు చేయకుండా ఉండాలి. అయితే, భారత్ ఈ ఒత్తిడులకు వెనక్కి తగ్గకుండా, రష్యా నుంచి చమురు దిగుమతులను కొనసాగిస్తూ, తన వాణిజ్య మరియు భద్రతా ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లేందుకు దృఢంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. భారత్‌పై అదనపు సుంకాలు విధించనున్నట్లు హెచ్చరించారు. అయితే, ట్రంప్ టారిఫ్ (Trump Tariff)బెదిరింపులకు వెనక్కి తగ్గని భారత్.. రష్యాతో సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) రష్యా పర్యటనకు వెళ్లారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే, దోవల్ (Ajit Doval)పర్యటన ముందుగానే ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రక్షణ, ఇంధన సంబంధాల బలోపేతమే ఈ పర్యటన ముఖ్య లక్ష్యంగా పేర్కొన్నాయి. పలు అంశాలపై రష్యా అధికారులతో దోవల్ (Ajit Doval)కీలక చర్చలు జరిపే అవకాశం ఉందని సమాచారం. ఈ నెలాఖరులో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా మాస్కోకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
అజిత్ దోవల్ బ్యాక్ గ్రౌండ్?
ఆయన కేరళ కేడర్ నుండి ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) నుండి రిటైర్డ్ అధికారి, దోవల్ గతంలో 2004 నుండి 2005 వరకు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవిని నిర్వహించారు, దశాబ్ద కాలం పాటు దాని కార్యకలాపాల విభాగానికి నాయకత్వం వహించారు. నేషనల్ డిఫెన్స్ కాలేజ్ (M.Phil.)
అజిత్ దోవల్ జాతి?
అజిత్ కుమార్ దోవల్ జనవరి 20, 1945న ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్హ్వాల్‌లోని ఘిరి బనెల్సియున్ గ్రామంలో భారత సైనిక అధికారి మేజర్ గుణనాద్ దోవల్ దంపతులకు గర్హ్వాలి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అజిత్ తన ప్రాథమిక విద్యను రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని కింగ్ జార్జ్ రాయల్ ఇండియన్ మిలిటరీ స్కూల్ (అజ్మీర్ మిలిటరీ స్కూల్)లో పొందారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Rahul Gandhi: అమిత్ షా కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు