విమాన రాకపోకలు ఈ నెల 11 వరకు నిలిపివేత
Flight Cancellation: దేశ రాజధాని ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం మరియు విజయవాడకు నడిచే ఇండిగో విమాన సేవలను ఈ నెల 11 వరకు రద్దు చేసినట్లు సమాచారం. విజయవాడ, రాజమహేంద్రవరం విమానాశ్రయాల డైరెక్టర్లు(Airport Directors) ఈ విషయం తెలిపారు.
Read Also: Global Summit 2025: తొలి రోజు రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు

ఢిల్లీ నుంచి AP కి ఇండిగో విమానాలు రద్దు
ప్రతి రోజు ఢిల్లీ-విజయవాడ(Vijayawada) మధ్య విమానం మధ్యాహ్నం 2:20 గంటలకు ల్యాండ్ అవుతూ, తిరిగి 2:50 గంటలకు బయలుదేరుతుంది. అలాగే, రాజమహేంద్రవరం–న్యూఢిల్లీ మధ్య నడిచే విమాన సర్వీసును కూడా ఈ నెల 11 వరకు నిలిపివేశారు. 12వ తేదీ నుంచి ఈ రాకపోకలు మళ్లీ ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం, ఈ విమానాశ్రయాల్లో రోజూ సుమారు 850 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇండిగో సేవల నిలిపివేత కారణంగా ప్రయాణికుల సంఖ్య కొద్దిగా తగ్గినట్టు సూచనలున్నాయి. ఈ విమానాశ్రయం నుంచి మొత్తం 11 రూట్లలో ప్రయాణికులు ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు చేరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: