బోర్డింగ్ పాస్ జారీ చేసిన ఒక ప్రయాణికుడు విమానం ఎక్కలేదు. (Air India Plane) ఆ విమానం టేకాఫ్ కోసం ట్యాక్సీవే వద్దకు వెళ్తుండగా సిబ్బంది ఈ విషయాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానాన్ని తిరిగి వెనక్కి తెచ్చారు. సెప్టెంబర్ 21న లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా (Air India Plane)విమానం షెడ్యూల్ కంటే 45 నిమిషాలు ఆలస్యమైంది.కాగా, టేకాఫ్ కోసం ఏఐ 162 విమానం టాక్సీవే వైపు వెళ్లింది. ఇంతలో బోర్డింగ్ పాస్ జారీ చేసిన ఒక ప్రయాణికుడు (the traveler)విమానం ఎక్కలేదని సిబ్బంది దృష్టికి వచ్చింది. దీంతో ఆ విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ వద్దకు మళ్లించారు.

మరోవైపు ప్రామాణిక భద్రతా ప్రోటోకాల్ ప్రకారం ఆ ప్రయాణికుడి లగేజ్‌ను ఆఫ్‌లోడ్ చేయడానికి విమానం వెనక్కి వచ్చిందని ఎయిర్ ఇండియా (Air India Plane) ప్రతినిధి తెలిపారు. ఆ తర్వాత కొంత ఆలస్యంగా హీత్రూ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరినట్లు చెప్పారు. కాగా, బోర్డింగ్ పాస్ స్కాన్ చేసిన తర్వాత ఆ ప్రయాణికుడు పొరపాటున డిపార్చర్ గేటు వైపు కాకుండా ఎరైవల్స్ గేట్ వద్దకు వెళ్లినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి వివరించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడ్ని ప్రశ్నించేందుకు ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానాలు ఎన్ని?
ప్రస్తుతం, టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా వద్ద 187 విమానాలు ఉన్నాయి – 127 నారో-బాడీ మరియు 60 వైడ్-బాడీ విమానాలు. ఈ విమానయాన సంస్థ వద్ద 22 బోయింగ్ 777లు – 19 B777-300 ERలు (విస్తరించిన శ్రేణి) మరియు 3 B777-200 LRలు, 32 బోయింగ్ 787లు – 26 B787-8లు మరియు 6 B787-9లు మరియు 6 A350లు ఉన్నాయి.
ఎయిర్ ఇండియా పొడవైన విమానం ఏది?
ఈ ఎయిర్‌లైన్ అత్యధికంగా సేవలందిస్తున్న దేశాలు యునైటెడ్ స్టేట్స్ (4 గమ్యస్థానాలు), సౌదీ అరేబియా (3 గమ్యస్థానాలు) ఉన్నాయి. ప్రస్తుతం, ఎయిర్ ఇండియా నడుపుతున్న అతి పొడవైన విమానం శాన్ ఫ్రాన్సిస్కో మరియు బెంగళూరు మధ్య 777-200LR ను ఉపయోగిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: