Air India Crash Case : అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే దురదృష్టవశాత్తు కూలిపోయిన Air India Boeing Dreamliner విమాన ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి పైలట్-ఇన్-కమాండ్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ ను ఎవరూ నిందించలేరని సుప్రీం కోర్టు స్పష్టమైన వ్యాఖ్య చేసింది.
ఈ కేసులో పిటిషన్ వేసిన 91 ఏళ్ల తండ్రి పుష్కరాజ్ సభర్వాల్ ముందు కోర్టు, Air India Crash Case “మీరు మీ మీద భారం వేసుకోకండి, మీ కొడుకు తప్పు చేయలేదు. ఇది ఒక ప్రమాదం మాత్రమే.
Read Also : Crime:రష్యాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి.. డ్యామ్ లో లభ్యం
అతనిపై ఎలాంటి అనుమానం లేదా ఆరోపణ లేవు” అని ధైర్యం చెప్పింది. విమాన ప్రమాదాల పరిశోధన కోసం పనిచేసే AAIB ఇచ్చిన ప్రాథమిక నివేదికలో కూడా ఇంజిన్‌లకు ఇంధన సరఫరా టేకాఫ్ తర్వాత అకస్మాత్తుగా ఆగిపోయిన విషయమే ఉన్నదని, కానీ పైలట్ పై ఎలాంటి తప్పుదొర్లింపు లేదని కోర్టు గుర్తించింది.

కోర్టు అంతకుముందు కూడా విమాన ప్రమాదాల పరిశీలనలో లక్ష్యం నిందితులను వెతకడం కాదని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సాంకేతిక, భద్రతా చర్యలు సూచించడం ముఖ్యమని పేర్కొంది. పైలట్ తండ్రి కోరినట్లుగా కోర్టు ఈ విచారణను నవంబర్ 10కి వాయిదా వేసింది, తద్వారా కేసు నిష్పక్షపాతంగా, స్పష్టంగా, సాంకేతిక ఆధారాలతో ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read also :