ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘జన నాయగన్’ కు కష్టాలు తప్పడం లేదు. సెన్సార్‌బోర్డు ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల వేళ విజయ్‌కి (Actor Vijay) తమిళనాడు సీఎం స్టాలిన్ మద్దతుగా నిలవడం ఆసక్తికరంగా మారింది.
Read Also: http://Heavy Rain Warning: TN, APలో భారీ వర్షాలు

ఇదే సమయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ఎన్డీయే ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందని విమర్శించారు. ఈ జాబితాలోకి తాజాగా సెన్సార్ బోర్డు కూడా వచ్చి చేరిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఎఫ్‌సీ ని కూడా ఆయుధంగా మార్చుకుంటోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్టాలిన్ పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: