हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Latest News: Ravi Kishan: చంపుతామంటూ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు బెదిరింపులు

Anusha
Latest News: Ravi Kishan: చంపుతామంటూ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు బెదిరింపులు

గోరఖ్‌పూర్‌ (Gorakhpur) లో ప్రముఖ భోజ్‌పురి నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌ (MP Ravi Kishan) కు హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ హత్య బెదిరింపు దేశ రాజకీయాల్లో కలకలం సృష్టించింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మరీ.. ఎంపీ (MP) తమ వర్గాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించాడు. అంతటితో ఆగకుండా ఆయన్ని చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటనపై గోరఖ్‌పూర్‌లోని పోలీస్‌ స్టేషన్‌లో ఎంపీ సిబ్బంది ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Ajith: కరూర్ తొక్కిసలాట.. స్పందించిన అజిత్

నిందితుడు నేరుగా ఎంపీకి కాకుండా.. ఆయన వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదీకి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ద్వివేది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి “రవి కిషన్ మా వర్గాన్ని అవమానించేలా మాట్లాడారు. కాబట్టి అతన్ని కాల్చేస్తాం. అతని కదలికల గురించి నాకు పూర్తిగా తెలుసు.

మరో నాలుగు రోజుల్లోనే అతను బిహార్‌ (Bihar) కు వస్తున్నాడు. మార్గమధ్యంలోనే అతన్ని చంపేస్తాం” అని స్పష్టం చేశాడు. అంతేకాకుండా ఆ దుండగుడు ఎంపీని ఉద్దేశిస్తూ పలు అసభ్యకరమైన, అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశాడని ద్వివేది తెలిపారు. అయితే రవి కిషన్ ఏ వర్గాన్ని ఉద్దేశించి ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని శివం ద్వివేది ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

 Ravi Kishan
 Ravi Kishan

ఎంపీ రవి కిషన్ కూడా స్పందించారు

అలాగే ఎంపీకి భద్రత పెంచాలని, బెదిరింపులకు పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీ సిబ్బంది గోరఖ్‌పూర్ పోలీసులను అభ్యర్థించారు.మరోవైపు తాజా బెదిరింపులపై ఎంపీ రవి కిషన్ కూడా గట్టిగా స్పందించారు.

గుర్తు తెలియని ఆ వ్యక్తి తనను ఫోన్‌లో దుర్భాషలాడటంతో పాటు తన తల్లి గురించి కూడా అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని ఆయన తెలిపారు. ఇవి సమాజంలో ద్వేషం, అరాచకత్వాన్ని వ్యాప్తి చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలని అన్నారు.

ఇలాంటి బెదిరింపులకు తాను భయపడను అని ఆయన ధైర్యంగా ప్రకటించారు. ప్రజాస్వామ్య బలం, సైద్ధాంతిక సంకల్పంతో ఈ బెదిరింపులను ఎదుర్కొంటానని చెప్పారు. ప్రజా సేవ, ధర్మ మార్గంలో నడవాలనేది తన రాజకీయ వ్యూహం మాత్రమే కాదు.. అది తన జీవిత సంకల్పం కూడా అని రవి కిషన్ వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870