చిన్న శంకరంపేట జూలై 28 ప్రభాతవార్త :
కారు బోల్తా పడి ఒకరు మృతి చెందిన సంఘటన చిన్న శంకరంపేట మండల కేంద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి….
చెగుంట మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన జశ్వంత్, రుద్రారం గ్రామానికి చెందినదాము, అచ్చంపేట కు చెందిన రమేష్ స్నేహితులు. కాగా కారులో చిన్న శంకరంపేట నుండి చేగుంట వైపునకు ప్రయాణిస్తుండగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు (petrol pump) వద్దకు రాగానే కారు అదుపుతప్పడంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టగా కారు బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న జస్వంత్ మృతి చెందాడు. విద్యుత్ స్తంభం కూడా విరిగిపోయింది. తీవ్ర గాయాల పాలైన రమేష్ (Ramesh) మేడ్చల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. దాముకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Hindi News : hindi.vaartha.com
Read also : K. Ramakrishna : చంద్రబాబు పాలనలో మార్పు ఏది?