ఆధార్(Aadhaar) కార్డులో పేరు, పుట్టిన తేదీ, జెండర్, చిరునామా, మొబైల్ నెంబర్ వంటి వ్యక్తిగత వివరాలను మార్చుకోవడానికి ఇకపై ఆధార్ కేంద్రం వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. నవంబర్ 1 నుంచి ఈ మార్పులను ప్రజలు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో(Online) చేసుకునే సరికొత్త విధానాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అందుబాటులోకి తీసుకురానుంది. ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను మరింత వేగంగా, సురక్షితంగా మార్చడమే ఈ కొత్త ఆన్‌లైన్ విధానం ముఖ్య ఉద్దేశం.
Read Also: Alcohol: తాగుడుకు దూరమవుతున్న యువత.. మంచి పరిణామమే..
బయోమెట్రిక్స్‌కు ఆధార్ కేంద్రమే తప్పనిసరి
వ్యక్తిగత వివరాలు ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చినప్పటికీ, వేలిముద్రలు (Fingerprints), కనుపాప (Iris) వంటి బయోమెట్రిక్ అప్‌డేట్‌ల కోసం మాత్రం దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుందని UIDAI స్పష్టం చేసింది. ఈ రెండు రకాల సేవలకు వేర్వేరు ఫీజులను కూడా నిర్ణయించారు.

పెరిగిన ఫీజులు, మినహాయింపులు
ఆధార్ అప్‌డేట్‌కు సంబంధించిన ఫీజులు కూడా పెరిగాయి:
- పేరు, చిరునామా వంటి డెమోగ్రాఫిక్ మార్పులకు: రూ.75 చెల్లించాల్సి ఉంటుంది.
- బయోమెట్రిక్ మార్పులకు (వేలిముద్రలు, కనుపాప): రూ.125 చెల్లించాల్సి ఉంటుంది.
- 15 ఏళ్లలోపు చిన్నారులకు: చిన్నారుల బయోమెట్రిక్ మార్పుల కోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని UIDAI పేర్కొంది.
ఆధార్ వివరాలను ఇంటి నుంచే ఎప్పటి నుంచి మార్చుకోవచ్చు?
నవంబర్ 1 నుంచి ఈ కొత్త ఆన్‌లైన్ విధానం అమల్లోకి వస్తుంది.
ఏ రకమైన మార్పుల కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లాలి?
వేలిముద్రలు, కనుపాప వంటి బయోమెట్రిక్ అప్‌డేట్‌ల కోసం తప్పనిసరిగా ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: