భారతీయుల కోసం ఆధార్(Aadhaar) అవసరం, కానీ ఇటీవలి కాలంలో కొందరు నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి ప్రభుత్వ పథకాల్లో మోసాలు చేస్తున్నారని గుర్తించబడింది. ఈ సమస్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం(Government) కీలక నిర్ణయం తీసుకుంది. చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేయడం ద్వారా డేటాబేస్ పారదర్శకతను పెంచేందుకు యూఐడీఏఐ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు సుమారు 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Read also: అయ్యో! ఎంత పని చేశావురా.. 11ఏళ్ల బాలుడు ఆత్మహత్య..

నకిలీ ఆధార్ నివారణకు కేంద్రం తీసుకున్న చర్యలు
ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతున్నందున, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా, నకిలీ ఆధార్,(Aadhaar) పాన్ కార్డుల సమస్య కొనసాగుతోంది. ఆధునిక ఏఐ సాంకేతికతను కూడా దుర్వినియోగం చేసి కొందరు నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ ప్రజలకు సులభంగా ఆధార్ సేవలను అందించే విధంగా కొన్ని మార్పులు తీసుకురానుంది. కొత్త యాప్, ఫేసియల్ అథెంటికేషన్ వంటి సాంకేతికతలను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కేంద్రం వెల్లడించిన ప్రకారం, 2024లో డీయాక్టివేషన్ ప్రారంభించి, జులైలో సుమారు 1 కోటి 17 లక్షల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్లు చెప్పింది. సెప్టెంబర్ నెల వరకు ఈ సంఖ్య 1 కోటి 40 లక్షలకు చేరింది. నవంబర్ 26, 2025 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 2 కోట్ల ఆధార్ నంబర్లను యూఐడీఏఐ డీయాక్టివేట్ చేసింది. ఈ ప్రక్రియలో భారత రిజిస్ట్రార్ జనరల్, రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుండి అందిన మరణాల నమోదు డేటాను ఆధారంగా తీసుకుని ఇతర డేటాతో పోల్చి డీయాక్టివేషన్ చేయబడింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: