ఈ కాలంలో యువత అందరూ తక్షణ ఫలితాలకే అలవాటైపోతున్నారు. కానీ ఛండీగఢ్‌కు చెందిన 88 ఏళ్ల ఇందర్ జిత్ సింగ్ సిద్ధు (88-year-old Inderjit Singh Sidhu from Chandigarh) మాత్రం అందరికీ భిన్నంగా కొనసాగుతున్నారు. ఎలాంటి డబ్బు ఆశ లేకుండా, ప్రతిరోజూ చెత్త క్లీన్ చేయడం ఆయన దినచర్యగా మారింది. ఆయనకు సేవే ధర్మం, పరిశుభ్రతే లక్ష్యం.సిద్ధు గారు ఒకప్పటి పోలీస్ డీఐజీ. రిటైర్ (Police DIG. Retired) అయినా విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచనే లేదు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే తన రిక్షా బండీతో బయలుదేరుతారు. సెక్టార్ 49 రోడ్లపై పడిపోయిన చెత్తను స్వయంగా తొలగిస్తూ, నిశ్శబ్దంగా సేవచేస్తుంటారు.

జాతీయ స్థాయిలో ర్యాంక్ రాకపోవడమే మోటివేషన్
చండీగఢ్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మంచి ర్యాంక్ రాకపోవడం ఆయనను కలచివేసింది. కానీ ఫిర్యాదు చేయడం కంటే, స్వయంగా మార్పు తీసుకురావాలని నిశ్చయించారు. చిన్నచిన్న చెత్త ముక్కల్ని ఎత్తేస్తూ, పెద్ద సందేశాన్ని అందిస్తున్నారు.ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ పనిని గమనించారు. సోషల్ మీడియాలో ఆయన సిద్ధు గారిపై ప్రశంసల వర్షం కురిపించారు. “ఈ నిశ్శబ్ద స్వచ్ఛతా యోధుడికి నా సెల్యూట్!” అంటూ ట్వీట్ చేశారు. వయసు ఏదైనా సేవకు ఎప్పుడూ అవకాశం ఉందని అన్నారు.
సేవకు వయస్సుతో పని లేదు
సిద్ధు గారు చెబుతున్నది ఒకే మాట – మంచి చేయాలన్న సంకల్పానికి వయస్సుతో పనిలేదు. ప్రతీ వ్యక్తి తన పరిసరాలను శుభ్రంగా ఉంచితే, దేశం మొత్తం మారిపోతుందని నమ్ముతారు. ఆయన జీవితం అనుసరణీయమైంది.వృద్ధాప్యంలోనూ చురుకుగా పని చేస్తూ, సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్న ఇందర్ జిత్ సింగ్ సిద్ధు… నేటి తరం యువతకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు. సేవ అంటే సమయానికి గానీ, వయసుకే గానీ పరిమితం కాదని ఆయన పనితనమే బలంగా చెబుతోంది.
Read Also : Air India : ఎయిరిండియా విమానంలో మంటలు