తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీవీకే అధినేత విజయ్ (Vijay) తన రాజకీయ ప్రచార షెడ్యూల్‌ను వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ పుదుచ్చేరిలోని ఉప్పలం గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే విజయ్ సమావేశానికి పుదుచ్చేరి ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. TVK పార్టీ (TVK Party) మీటింగ్‌కు 5 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది..
Read Also: DK Shivakumar : మరోసారి తెరపైకి సీఎం పదవికి వివాదం..డీకే శివకుమార్ స్పందన
అడ్డుకున్న పోలీసులు
అయితే, బహిరంగ సభ వద్ద కలకలం రేగింది. సభా ప్రాంగణంలోకి తుపాకీతో ప్రవేశించేందుకు యత్నించిన ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అతడిని పార్టీ శివగంగై జిల్లా కార్యదర్శి ప్రభుకు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న డేవిడ్‌గా గుర్తించారు. ఈ ఘటనతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషాదం తర్వాత విజయ్ (Vijay) నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే కావడంతో పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా సభా ప్రాంగణంలోకి పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు ప్రవేశం నిరాకరించారు.
పార్టీ జారీ చేసిన ప్రత్యేక క్యూఆర్ కోడ్ పాస్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించారు. తాగునీరు, అంబులెన్సులు, ప్రథమ చికిత్స బృందాలను సిద్ధంగా ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు. అంతకుముందు విజయ్ రోడ్ షోకు అనుమతి నిరాకరించిన పోలీసులు, కేవలం సభకు మాత్రమే కఠిన షరతులతో కూడిన అనుమతినిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: