భారతదేశం 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో(2025-26 Finanace) ఘనమైన వృద్ధిని నమోదు చేసింది. తాజా అధికారిక గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 30, 2025 ముగిసే రెండవ త్రైమాసికంలో భారతదేశ(India) స్థూల దేశీయోత్పత్తి (GDP) 8.2 శాతం పెరిగింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూల సంకేతాలు ఇచ్చింది. 2024 సెప్టెంబర్ త్రైమాసికంలో GDP వృద్ధి 5.6%గా నమోదైన తర్వాత, 2025-26 రెండవ త్రైమాసికంలో 8.2% వృద్ధి సాధించడం గమనించదగిన అంశం. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వాస్తవ GDP లేదా స్థిర ధరల వద్ద GDP రూ.48.63 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది, ఇది 2024-25 ఏడాది రెండవ త్రైమాసికంలో రూ.44.94 లక్షల కోట్లుగా ఉంది. ఇది 8.2% వృద్ధిని సూచిస్తుంది.
నామమాత్రపు GDP, ప్రస్తుత ధరల వద్ద రూ.85.25 లక్షల కోట్లుగా అంచనా వేసింది, ఇది 2024-25 ఏడాది రెండవ త్రైమాసికంలో రూ.78.40 లక్షల కోట్లుగా ఉంది, అంటే 8.7% వృద్ధి. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వాస్తవ GVA (గ్రాస్స్ వాల్యూ అడేడేషన్) రూ.44.77 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది, ఇది 2024-25 రెండవ త్రైమాసికంలో రూ.41.41 లక్షల కోట్లతో పోలిస్తే 8.1% వృద్ధిని నమోదు చేసింది. అలాగే, నామమాత్రపు GVA రూ.77.69 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది, ఇది 2024-25 రెండవ త్రైమాసికంలో రూ.71.45 లక్షల కోట్లుగా ఉండి 8.7% వృద్ధిని సూచిస్తుంది.
Read also: ‘Vibe Coding’ సుందర్ పిచాయ్ ఏమంటున్నారంటే?

2025-26 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో భారతదేశ GDP వృద్ధి
(2025-26 Finanace) ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు 8.2%గా ఉన్నప్పటికీ, వ్యవసాయం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మరియు ఇతర యుటిలిటీ రంగాలు నమ్మకమైన వృద్ధి నమోదు చేసాయి. ఈ త్రైమాసికంలో ద్వితీయ రంగంలో తయారీ (9.1%) మరియు నిర్మాణం (7.2%) గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. ఆర్థిక, రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవలు (10.2%) కూడా ముఖ్యమైన వృద్ధిని ప్రదర్శించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, రియల్ ప్రైవేట్ తుది వినియోగ వ్యయం (PFCE) 7.9% వృద్ధిని నమోదు చేసింది, ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 6.4% ఉన్నది.
2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంతో పోలిస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో GDP 8.0% వృద్ధిని నమోదు చేసింది. మూడీస్ రేటింగ్స్ ప్రకారం, 2025లో భారతదేశ GDP 7% వృద్ధి నమోదు చేస్తుందని, 2026లో 6.4% వృద్ధి అంచనా వేయబడింది. ఈ సమయంలో, భారత్(India) అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. భారతదేశ GDP అనేది ఒక నిర్దిష్ట కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన అన్ని వస్తువుల, సేవల మొత్తం విలువ. దీనిని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రైవేట్ ఏజెన్సీల నుండి సేకరించిన గణాంకాల ఆధారంగా అంచనా వేయబడుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: