భారతదేశానికి చెందిన మనీశ్ ధామేజా అనే వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా అరుదైన రికార్డు సృష్టించారు. ఆయన దగ్గర ప్రస్తుతం 1,638 వాలిడ్ క్రెడిట్ కార్డులు (Credit Cards) ఉండటంతో, ఈ అసాధారణమైన అంశాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. సాధారణంగా ఒక వ్యక్తి దగ్గర రెండు లేదా మూడు క్రెడిట్ కార్డులు ఉంటే చాలు అనిపిస్తుంది. అయితే మనీశ్‌కు మాత్రం క్రెడిట్ కార్డులపై ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఆయనకు వివిధ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల నుంచి వచ్చిన కార్డుల కలెక్షన్ వేర్వేరు రంగులు, డిజైన్లు, ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంటుంది. ఆయన మాట్లాడుతూ.. “నాకు క్రెడిట్ కార్డ్స్ అంటే చాలా ఇష్టం. వాటి ద్వారా వచ్చే రివార్డ్స్, క్యాష్‌బ్యాక్‌లు, ట్రావెల్ పాయింట్స్ అద్భుతంగా ఉంటాయి” అని తెలిపారు.
Karur incident : కరూర్ ఘటనలో ఆచితూచి అడుగులేస్తున్న విజయ్
మనీశ్ ధామేజా ఈ కార్డులను కేవలం సేకరణకే కాకుండా, ఉపయోగకరంగా కూడా మలచుకున్నారు. ముఖ్యంగా పాత నోట్ల రద్దు సమయంలో (డీమోనిటైజేషన్) ఆయన వద్ద ఉన్న క్రెడిట్ కార్డులు చాలా ఉపయోగపడ్డాయని చెబుతున్నారు. “ఆ సమయంలో లిక్విడ్ క్యాష్ లేకపోయినా, నాకు లావాదేవీలు ఆగలేదు. ఎందుకంటే నాకున్న క్రెడిట్ కార్డులు నాకు ఆర్థిక సహకారం అందించాయి” అని ఆయన వెల్లడించారు. ఇది మాత్రమే కాదు, మనీశ్ దగ్గర 10 లక్షలకుపైగా నాణేలు (కాయిన్స్) సేకరించినందుకు మరో గిన్నిస్ రికార్డు కూడా ఉంది. అంటే ఆయనకు మోనటరీ కలెక్షన్‌పై ప్రత్యేకమైన అభిరుచి ఉందని చెప్పాలి.

అయితే చట్టపరంగా లేదా బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డులైనా ఉండవచ్చు. దానికి ఎటువంటి పరిమితి లేదు. కానీ, వాటిని సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం ఉండాలి. బిల్స్ టైమ్‌లో చెల్లించకపోతే, అధిక వడ్డీ భారాలు, క్రెడిట్ స్కోర్ పడిపోవడం వంటి సమస్యలు రావచ్చు. మనీశ్ ధామేజా మాత్రం తన కార్డులను క్రమబద్ధంగా నిర్వహిస్తూ, ఫైనాన్షియల్ డిసిప్లిన్‌కి ఆదర్శంగా నిలిచారు. ఆయన కథ, ఆర్థికంగా తెలివిగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో యువతకు ఒక ప్రేరణగా మారింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/