ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లో మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఒక కీలక మలుపు తిరిగింది. గాంధీ జయంతి సందర్భంగా ఒకేసారి 103 మంది మావోయిస్టులు హింసా మార్గాన్ని శాశ్వతంగా వీడి, ప్రజాస్రవంతిలో కలిసిపోయారు. ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో ఘనంగా జరిగింది. పోలీసు, పారామిలటరీ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో మావోయిస్టులు తమ వద్ద ఉన్న ఆయుధాలను సమర్పించి అధికారుల ముందు లొంగిపోయారు.
Crime: ప్రభుత్వ ఉద్యోగం పోతుందనే భయంతో.. బిడ్డను అడవిలో పారేసిన దంపతులు
లొంగిపోయిన వారిలో 49 మందిపై ఏకంగా రూ.1.06 కోట్ల రివార్డు ఉండటం గమనార్హం. వీరిలో డివిజనల్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు, మిలీషియా కమాండర్లు వంటి కీలక నేతలు కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పూనా మర్గం’ (నవ జీవన మార్గం) అనే పునరావాస కార్యక్రమం కింద వీరంతా లొంగిపోయారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.50,000 చెక్కును అందించింది.మావోయిస్టు (Maoists) సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోవడం, సంస్థలో అంతర్గత విభేదాలు, ప్రశాంతమైన కుటుంబ జీవితం గడపాలన్న ఆకాంక్ష వంటి కారణాలతోనే వారు లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు.

జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో కీలకపాత్ర
సీనియర్ నాయకులు ఎన్‌కౌంటర్లలో (encounters) మరణించడం, ప్రజల నుంచి మద్దతు కరవవడం కూడా మావోయిస్టుల పతనానికి కారణమవుతోందని వారు విశ్లేషించారు.ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న బహుముఖ వ్యూహం సత్ఫలితాలనిస్తోందని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు.
కొత్తగా భద్రతా క్యాంపులు ఏర్పాటు చేయడం, రోడ్లు, విద్యుత్, నీటి వసతులు కల్పించడం, కమ్యూనిటీ పోలీసింగ్ వంటివి మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని వారు పేర్కొన్నారు.ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు బీజాపూర్ జిల్లా (Bijapur district) లో 421 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా, 410 మంది లొంగిపోయారు.
137 మంది వివిధ ఎన్‌కౌంటర్లలో మరణించారు. ఈ భారీ లొంగుబాటు కేవలం భద్రతా బలగాల వ్యూహాత్మక విజయంగానే కాకుండా, హింసాత్మక సిద్ధాంతంపై శాంతి సాధించిన విజయంగా అధికారులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: