हिन्दी | Epaper

ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

Vanipushpa
ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం నిత్యకృత్యంగా మారింది. గత వారం రోజుల్లో ఏకంగా మూడుసార్లు ఢిల్లీ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చాయి. మంగళవారం ఉదయం ఢిల్లీలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌, నార్త్‌ వెస్ట్ ఢిల్లీలోని సరస్వతి విహార్‌లో గల ఓ పాఠశాలకు బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇ-మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆయా పాఠశాలల వద్దకు చేరుకొని విద్యార్థులను, సిబ్బందిని ఖాళీ చేయించారు. అనంతరం బాంబ్ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్ సాయంతో పాఠశాలల ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
బాంబు బెదిరింపులతో బేజారు
ఇటీవల విమానాల్లో బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్స్ రావడం లేదా మెయిల్స్ రావడం పరిపాటుగా మారింది. తాజాగా స్కూల్స్ లో కూడా బాంబు బెదిరింపులు రావడంతో అధికారుల తలలు పట్టుకుంటున్నారు. గత వారం రోజుల్లో ఏకంగా మూడుసార్లు ఢిల్లీ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు రావడంతో అధికారుల అప్రమత్తం అయి తనిఖీలు నిర్వహించారు. ఫేక్ మెయిల్స్, కాల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు పోలీసులకు చెప్పారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీఎంకేను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధం: టీవీకే చీఫ్ విజయ్

డీఎంకేను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధం: టీవీకే చీఫ్ విజయ్

హర్ముజ్ జలసంధిలో భారత్‌ ట్యాంకర్లకు లైన్ క్లియర్!

హర్ముజ్ జలసంధిలో భారత్‌ ట్యాంకర్లకు లైన్ క్లియర్!

పశ్చిమాసియాలో ఆరోగ్య సంక్షోభం: WHO డైరెక్టర్ జనరల్ ఆందోళన

పశ్చిమాసియాలో ఆరోగ్య సంక్షోభం: WHO డైరెక్టర్ జనరల్ ఆందోళన

ఇకపై ‘గ్రోక్’ ఏఐ ఉచితం కాదు.. మస్క్ కీలక నిర్ణయం!

ఇకపై ‘గ్రోక్’ ఏఐ ఉచితం కాదు.. మస్క్ కీలక నిర్ణయం!

బంగ్లాదేశ్‌లో ఇంధన సెగ.. యూనివర్సిటీలకు సెలవులు

బంగ్లాదేశ్‌లో ఇంధన సెగ.. యూనివర్సిటీలకు సెలవులు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

గల్ఫ్ దేశాల నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు

గల్ఫ్ దేశాల నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు

యూజర్లకు ఆపిల్ బిగ్ షాక్.. 15 డివైస్‌లు నిలిపివేస్తూ నిర్ణయం

యూజర్లకు ఆపిల్ బిగ్ షాక్.. 15 డివైస్‌లు నిలిపివేస్తూ నిర్ణయం

బెంగాల్‌లో మారుతున్న వాతావరణం

బెంగాల్‌లో మారుతున్న వాతావరణం

గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

భారత్‌లో iQOO Z11x 5G విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

భారత్‌లో iQOO Z11x 5G విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

కొవిడ్ టీకా మరణాల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

కొవిడ్ టీకా మరణాల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

📢 For Advertisement Booking: 98481 12870