ఒకప్పుడు తన సంచలన అధ్యయన నివేదికలతో భారత్ లో అదానీ గ్రూప్ కు చుక్కలు చూపించిన అమెరికా పెట్టుబడులు, పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ అనూహ్యంగా మూతపడనుంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాలు ఇలా వున్నాయి. హిండెన్ బర్గ్ ను మూసేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ సంచలన ప్రకటన చేశాడు. షార్ట్ సెల్లింగ్ స్పెషలిస్ట్ గా పేరున్న హిండెన్ బర్గ్ రీసెర్చ్ గత కొన్నేళ్లలో చేసిన అధ్యయనాలు, నివేదికలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఎన్నో ఏళ్లుగా కుబేరులు పోగేసుకున్న భారీ సంపదను ఆవిరయ్యేలా చేసాయి. ఇప్పుడు అనూహ్యంగా ఆ సంస్థ మూతపడుతుండటం షాకింగ్ గా మారింది.

2017లో ప్రారంభమైన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ 2023లో భారత్ కేంద్రంగా పనిచేస్తున్న అదానీ గ్రూప్ షార్ట్ సెల్లింగ్ కు పాల్పడి ఖాతాదారుల్ని మోసం చేస్తోందంటూ ఇచ్చిన రిపోర్ట్ ఆ సంస్థ షేర్లను భారీగా పతనం అయ్యేలా చేసింది. విపక్షాలకు అదానీ గ్రూప్ టార్గెట్ అయ్యేలా చేసింది. అలాగే సీబీఐ దర్యాప్తులకు, సుప్రీంకోర్టు విచారణలకు కారణమైంది. చివరికి విదేశీ సంస్థలు ఇచ్చే నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటూ పోతే భారత్ లో సంస్థలు మనుగడ సాగించలేవని సుప్రీంకోర్టు పిటిషన్లను తోసిపుచ్చింది. తన ప్రకటన వెనుక ఉన్న కారణాలను కూడా వెల్లడించాడు. తనకు ఎలాంటి బెదిరింపులు రాలేదని, తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, పెద్దగా వ్యక్తిగత సమస్యలు కూడా లేవని అండరన్స్ తెలిపాడు. అయితే ప్రపంచంలో చాలా మందిని, తాను శ్రద్ధ వహించే వ్యక్తులను కోల్పోవడం వెనుక తీవ్రత తన దృష్టి వచ్చిందని పేర్కొన్నాడు.