हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Narendra Modi: రైతుల శ్రేయస్సే మాకు ముఖ్యం ట్రంప్ కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

Sharanya
Narendra Modi: రైతుల శ్రేయస్సే మాకు ముఖ్యం ట్రంప్ కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

దేశ రైతుల హితం కోసం ఎలాంటి రాజీకి తావులేదని, అవసరమైతే ఏ మూల్యమైనా చెల్లించేందుకు తాను సిద్ధమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తేల్చిచెప్పారు. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాల యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసిన మరుసటి రోజే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Narendra Modi:
Narendra Modi:

అమెరికా సుంకాల యుద్ధం.. మోదీ ధీటైన స్పందన

రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకున్నందుకుగాను భారత్ ఎగుమతులపై అమెరికా ఇటీవల 25% అదనపు సుంకాలు విధించింది. మునుపటి 25%తో కలిపి మొత్తం 50%కు చేరిన ఈ సుంకాలు భారత్‌కి పెద్ద దెబ్బ. ఇదే తరుణంలో ఢిల్లీలో జరిగిన ఎం.ఎస్. స్వామినాథన్ (M.S. Swaminathan) శతాబ్ది అంతర్జాతీయ సదస్సులో మోదీ మాట్లాడారు.

“రైతుల ప్రయోజనాల్లో రాజీ లేదు”

“రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు – వీరి ప్రయోజనాలే మా ప్రభుత్వానికి ప్రాధాన్యం. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అవసరమైతే వ్యక్తిగతంగా త్యాగానికి కూడా సిద్ధమే. దేశంలోని ప్రతి రైతు కోసం భారత్ నిబద్ధంగా నిలుస్తుంది” అంటూ ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

విదేశాంగ శాఖ స్పందన – అమెరికా చర్య అన్యాయం

అమెరికా విధించిన సుంకాలపై భారత విదేశాంగ శాఖ కూడా తీవ్రంగా స్పందించింది. “రష్యా చమురు దిగుమతులపై భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయం. ఇది అహేతుకమైన చర్య. 140 కోట్ల ప్రజల ఇంధన భద్రతకు అవసరమైన అన్ని చర్యలు భారత్ తీసుకుంటుంది,” అని ఘాటుగా పేర్కొంది. చమురు దిగుమతులు భారత్‌కు కీలకమైన అంశమని, దేశ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని సరఫరాలను కొనసాగించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. భారత్ దయచేసే దేశం కాదని, తన ప్రజల భద్రత కోసం అవసరమైన ప్రతి చర్యకైనా వెనుకాడబోదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/crime-girlfriend-commits-suicide-after-being-harassed-by-boyfriend/crime/527268/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870