భారత్, పాకిస్థాన్ మధ్య సోమవారం జరగనున్న కాల్పుల విరమణ చర్చలకు కొద్ది గంటల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు.ఈ సంభాషణ, చర్చలకు మరింత ప్రాధాన్యతను చేకూర్చింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై వాన్స్ సమాచారం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్ భద్రతపై మోదీ నిఖార్సైన స్ఫష్టత
ఈ సందర్భంగా మోదీ జాతీయ భద్రతపై భారత ప్రభుత్వ దృక్పథాన్ని నేరుగా వివరించారు. పాకిస్థాన్ నుంచి ఏదైనా ఉద్దేశపూర్వక చర్య జరిగితే, భారతదేశం తగిన తీరులో స్పందిస్తుందని చెప్పారు.”మన సౌమ్యతను బలహీనతగా పరిగణించొద్దు. దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు,” అని ఆయన హితవు పలికారు. ఉగ్రవాదంపై భారత్ ఎలాంటి సహనం పాటించదని ఆయన స్పష్టంగా చెప్పారు.
పీఓకే విషయంలో భారత్‌కు స్పష్టమైన స్థానం
ఇదివరకు కూడా ప్రధాని మోదీ పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) విషయంలో భారత్ దృఢంగా ఉన్నట్టు పలుమార్లు చెప్పారు. పీఓకే భారతదేశం అంతర్భాగమే అని స్పష్టం చేశారు.ఈ విషయంలో చర్చలే అవసరం లేదని, విదేశీ మధ్యవర్తిత్వానికి తావు లేదని అమెరికాకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. పీఓకేను శాంతియుతంగా భారత్‌కు అప్పగించడమే పాకిస్థాన్ ముందు ఉన్న మార్గమని మోదీ గతంలో చెప్పారు.
కాల్పుల విరమణకు అంతర్జాతీయ దృష్టి
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం గమనార్హం. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణపై ప్రకటన చేశారు. రెండు దేశాలు చర్చకు ముందుగానే అంగీకరించాయి.అయితే, భారత్ అప్రమత్తంగా ఉంది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సైన్యం తన చర్యలను కొనసాగిస్తోంది. సరిహద్దుల్లో ఏదైనా అవాంఛనీయ చర్య జరిగితే, తగినరీతిలో ఎదుర్కొనడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపింది.భారత్ శాంతికి అవకాశమిస్తే తప్పదు. కానీ, భద్రతపై రాజీ లేదు. ఈ చర్చలు శాంతికి దారి తీసినా, బలమైన నిర్ణయాలు అవసరం.ప్రధాని మోదీ సందేశం, అమెరికాకు ఇచ్చిన స్పష్టత – ఇవి భారత్ మద్దతును తెలియజేస్తున్నాయి. శాంతి కోసం ఆసక్తి ఉంది. కానీ దేశ భద్రతకు ఎప్పుడూ తొలి ప్రాధాన్యతే.
Read Also : Narendra Modi : పీవోకే విషయంలో తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరంలేదన్న మోదీ