పరీక్షలు ప్రారంభం కావడానికి ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన విద్యార్థులకు ప్రశాంతంగా పరీక్షలు రాయడం ఒత్తిడి లేకుండా ఎలా ఉండాలో సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంలో ఆయన తదుపరి తరగతులలో ప్రవేశం లేదా ఇతర సమస్యలపై కూడా మాట్లాడారు.ప్రధాని మోదీ ఢిల్లీలో సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి పాస్ అవుతారని నమ్మే విద్యార్థులను మాత్రమే ప్రమోట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఢిల్లీ విద్యావ్యవస్థలో అవినీతి ఉందని పాఠశాలలలో గ్యారంటీ పాస్ అవుతున్నవారినే పై తరగతులకు పంపుతున్నారని చెప్పారు.

ప్రధాని ఢిల్లీలోని పాఠశాలల విద్యా విధానంపై ఫైర్ అవుతూ 9వ తరగతిని దాటడానికి ఆమ్ ఆద్మీ పార్టీ అనుమతించనట్లు చెప్పారు. కేవలం పాస్ అవుతారని నమ్మే విద్యార్థులను మాత్రమే పై తరగతులకు పంపిస్తున్నారని ఆరోపించారు. రిజల్ట్ సరిపోతే తప్ప ప్రభుత్వానికి పరువు పోతుందని వారు భావించడంపై ప్రధాని దృష్టి పెట్టారు.ఢిల్లీ పాఠశాలలలో 9వ 11వ తరగతులలో ఫెయిల్ అవుతున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వివరాల ప్రకారం ప్రతి ఏడాదీ 9వ తరగతిలో లక్ష మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారని విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా ఢిల్లీ విద్యావ్యవస్థలో గల లోపాలను ప్రస్తావించారు.