ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ కు కేంద్ర అనుమతి తీసుకున్న నారా లోకేష్1

ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్‌కు కేంద్ర అనుమతి తీసుకున్న నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక పరిజ్ఞానం మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్, ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు మంత్రి హెచ్.డి. కుమారస్వామిని ఢిల్లీలో కలిశారు. అనకాపల్లిలో ఈ ప్లాంట్ ప్రారంభం అవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు. ప్లాంట్‌కు సంబంధించిన అనుమతులు త్వరగా లభించేందుకు కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్‌కు కేంద్ర అనుమతి తీసుకున్న నారా లోకేష్

విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం కేంద్రం దాదాపు ₹12,000 కోట్లు విడుదల చేసినందుకు లోకేష్ కుమారస్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్లాంట్‌లోని కార్మికుల సంక్షేమం కోసం ఈ నిధులు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కుమారస్వామి స్వయంగా ప్లాంట్‌ను సందర్శించినందుకు లోకేష్ ప్రశంసలు తెలిపారు. ఉత్పాదకతను పెంచేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.

ఇంతకుముందు, లోకేష్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి, ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. రక్షణ రంగ పెట్టుబడుల దృష్ట్యా రాష్ట్రంలో కొన్ని యూనిట్లు స్థాపించేందుకు కేంద్రం సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు. లోకేష్, టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని రాజ్‌నాథ్ సింగ్‌కు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర సహాయం అందిస్తోందని, రాష్ట్రం రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ, వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా టిడిపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని లోకేష్ తెలిపారు. ఈ సమావేశాలకు కేంద్ర మంత్రులు రామ్ మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, అలాగే పార్టీ ఎంపీలు హాజరయ్యారు.

Related Posts
కుంభమేళాకు రానున్న ప్రధాని మోదీ..ఎందుకంటే?

ప్రయాగ్‌రాజ్ ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణి సంగమంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహాకుంభమేళా సందర్భంగా పుణ్యస్నానాలు చేయడానికి అనేక మంది ఇక్కడ చేరుకున్నారు. వసంత పంచమి రోజున రద్దీ Read more

Jagan: వైవీ సుబ్బారెడ్డి తల్లికి జగన్ నివాళి
Jagan: సుబ్బారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె 85 సంవత్సరాల వయస్సులో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ Read more

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా:జగన్
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా:జగన్

జగన్ అధినేతలతో భేటీ:వైసీపీ అధినేత జగన్ వివిధ జిల్లాల నేతలతో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా Read more

ఈ నెల 17న మంగళగిరి ఎయిమ్స్ కు రాష్ట్రపతి
President to Mangalagiri AI

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్‌ ప్రథమ స్నాతకోత్సవానికి హాజరవుతున్నారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో Read more