हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: Nara Lokesh – జగన్ ప్రెస్‌మీట్‌పై స్పందించిన మంత్రి నారా లోకేశ్

Anusha
Latest News: Nara Lokesh – జగన్ ప్రెస్‌మీట్‌పై స్పందించిన మంత్రి నారా లోకేశ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తాజాగా కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన సందర్భంగా లోకేష్, జగన్ ఆరోపణలు పూర్తిగా వాస్తవం లేని వాటిగా వ్యాఖ్యానించారు.

జగన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానాన్ని కూడా సరిగా అర్థం చేసుకోలేదని లోకేష్ (Nara Lokesh) విమర్శించారు. ఆయన మాటల్లోనే గందరగోళం ఉందని, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే కనీసం తన సలహాదారులను అడగాలని సూచించారు. వైద్య రంగంలో పెట్టుబడులు రాబట్టేందుకు, కాలేజీలను అభివృద్ధి చేయడానికి పీపీపీ మోడల్‌నే మేము అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

అన్నీ కట్టేశామని చెప్పడం విడ్డూరం

లోకేష్ మాట్లాడుతూ – వైద్య కళాశాలల అభివృద్ధి కోసం తాము ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని ((PPP) policy) అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. వైద్య కళాశాలలకు వైసీపీ ప్రభుత్వం పునాదులైనా వేయలేదని, అన్నీ కట్టేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం ఒక్కటైనా నిజం మాట్లాడాలని సూచించారు. కొంతమందికి అవగాహన లేకపోతే, పీపీపీ గురించి పక్కనున్న సలహాదారులను అడిగి తెలుసుకోవాలని లోకేష్ అన్నారు.అంతలా మాట్లాడే వైసీపీ నాయకులు ఐదేళ్ల పాలనలో వైద్య కళాశాలలను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.

 Nara Lokesh
Nara Lokesh

మా ప్రభుత్వ లక్ష్యం అన్నింటినీ పూర్తి చేయడం

“మా ప్రభుత్వ లక్ష్యం అన్నింటినీ పూర్తి చేయడం, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడం” అని ఆయన అన్నారు.పులివెందుల ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి బెంగళూరు నుంచి మాట్లాడారా, విజయవాడ నుంచి అని లోకేష్ మీడియా ప్రతినిధులను ప్రశ్నించగా, వారు విజయవాడ నుంచి అని సమాధానమిచ్చారు. ఓహో, బెంగళూరు నుంచి మాట్లాడారనుకున్నా అంటూ ఆయన వ్యంగ్యంగా అన్నారు. 

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/hyderabad-greenfield-expressway-route-finalized-in-hyderabad/andhra-pradesh/545039/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870