Nandigam Suresh surrendered in court

కోర్టులో లొంగిపోయిన నందిగం సురేశ్

అమరావతి ఉద్యమం సమయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కేసు

అమరావతి : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ మళ్లీ జైలుకు వెళ్లనున్నారు. ఓ కేసు విషయంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కోర్టులో లొంగిపోయిన ఆయనకు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. అమరావతిలో ఓ మహిళపై దౌర్జన్యం చేశారని నందిగం సురేశ్ పై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో పోలీసుల చర్యలకు ముందుగానే మాజీ ఎంపీ సురేశ్ కోర్టులో లొంగిపోయారు. కోర్టులో లొంగిపోతే బెయిల్ వస్తుందన్న ఆలోచనతో ఆయన రాగా, న్యాయమూర్తి అనూహ్యంగా రిమాండ్ విధించినట్లు చెబుతున్నారు.

కోర్టులో లొంగిపోయిన నందిగం సురేశ్

అప్పట్లో కేసు నమోదు చేసినా… అరెస్టులు చేయని పోలీసులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాజీ ఎంపీ సురేశ్ పై వరుస కేసులు నమోదవుతున్నాయి. మంగళగిరిలో పార్టీ కార్యాలయంపై దాడి కేసులో తొలుత అరెస్టు అయిన సురేశ్ జైలుకు వెళ్లారు. ఆ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే 2020లో వెలగపూడిలో చోటుచేసుకున్న ఓ హత్యకేసులో మాజీ ఎంపీని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో బెయిల్ వచ్చేవరకు ఆయన 145 రోజులు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపారు.

ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సురేశ్ తరపు న్యాయవాదులు

వెలగపూడికి చెందిన మరియమ్మ హత్యకేసులో బెయిల్ వచ్చిన నందిగం సురేశ్ జనవరి 30న విడుదలయ్యారు. దాదాపు 17 రోజులుగా బయటే ఉన్న ఆయనపై తాజాగా అమరావతికి చెందిన మహిళ ఫిర్యాదు చేయడంతో మళ్లీ జైలుకు వెళ్లాల్సివచ్చిందంటున్నారు. అయితే ఈ కేసులో పోలీసు చర్యలకు ముందే ఆయన కోర్టులో లొంగిపోవడం గమనార్హం. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం సురేశ్ తరపు న్యాయవాదులు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Related Posts
ప్రజలు మోసపు మాటలను నమ్మి చంద్రబాబుకు ఓట్లు వేశారు – జగన్
jagan babu

అబద్ధాలు ప్రచారం చేసి కూటమి ఎన్నికల్లో గెలిచిందని, ప్రజలు మోసపు మాటలను నమ్మి ఓట్లు వేశారని, రాష్ట్రాన్ని కూటమి నిండా ముంచేసిందన్నారు మాజీ సీఎం , వైసీపీ Read more

ఇటలీ ప్రధాని: G7 మంత్రి సమావేశంలో నెతన్యాహూ అరెస్ట్ వారంటు పై చర్చ జరగనుంది
Giorgia meloni

ఇటలీలో వచ్చే వారంలో జరుగనున్న G7 మంత్రి సమావేశాల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ జారీ చేసిన అరెస్ట్ వారంటు పట్ల Read more

భారత్‌లో మరో రెండు హెచ్‌ఎమ్‌పీవీ కేసులు
Two more cases of HMPV in India

న్యూఢిల్లీ: చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు భారత్‌లోనూ క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు, అహ్మదాబాద్‌లో ఒకటి, చెన్నైలో మరో Read more

తిరుపతిలో ప్రారంభమైన టెంపుల్‌ ఎక్స్‌పో
Temple Expo started in Tirupati

ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు తిరుపతి : తిరుపతిలో ఇంటర్నేషనల్‌ టెంపుల్స్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మూడు Read more