Nagababu సతీసమేతంగా చంద్రబాబును కలిసిన నాగబాబు

Nagababu : సతీసమేతంగా చంద్రబాబును కలిసిన నాగబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు ఏపీ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, నాగబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం మండలి చైర్మన్ కార్యాలయంలో జరగగా, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, జనసేన నేతలు హాజరయ్యారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను ప్రదర్శిస్తానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని నాగబాబు ప్రమాణం చేశారు.

Advertisements
Nagababu సతీసమేతంగా చంద్రబాబును కలిసిన నాగబాబు
Nagababu సతీసమేతంగా చంద్రబాబును కలిసిన నాగబాబు

తర్వాత నాగబాబు తన సతీమణి పద్మజతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కార్యాలయానికి వెళ్లిన నాగబాబు దంపతులు చంద్రబాబుకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, నాగబాబుకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయనకు శాలువా కప్పి వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు.ఇదిలా ఉండగా నాగబాబు ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీకి ఇది మరింత బలాన్ని చేకూరుస్తుందని నేతలు అంటున్నారు. శాసన మండలిలో జనసేన శబ్దం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Related Posts
వర్మ వ్యవహారం టీడీపీ అంతర్గతం: నాదెండ్ల మనోహర్
వర్మ వ్యవహారం టీడీపీ అంతర్గతం: నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాల్లో తాజాగా పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ద‌క్క‌క‌పోవ‌డం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, Read more

ఏపీలో మగవారికీ పొదుపు సంఘాలు.. నిబంధనలు ఇవే
Men's Savings

ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే పరిమితమైన పొదుపు సంఘాలను ఇప్పుడు మగవారికీ విస్తరించేందుకు మెప్మా (MEPMA) చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి అధికారులు Read more

బాలికల అక్రమ రవాణాను అడ్డుకున్న రైల్వే పోలీసులు
visakhapatnam

ఒడిస్సా నుంచి అక్రమంగా బాలికలను రవాణా చేస్తున్న 11 మందిని విశాఖ రైల్వే పోలీసులు కాపాడారు. శనివారం ఉదయం కిరండో నుంచి విశాఖకు వచ్చిన ఎక్స్‌ప్రెస్‌ రైలులో Read more

పోలీసుల కస్టడీకి తులసిబాబు
Kamepalli Tulasi Babu

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు లో నిందితుడు కామేపల్లి తులసి బాబు ను గుంటూరు కోర్టు మూడు రోజులు పోలీస్ కస్టడీకి Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×