చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన పాన్-ఇండియా చిత్రం “తండేల్” ఫిబ్రవరి 7న విడుదల కానుంది. విడుదలకు ముందు, చిత్ర బృందం హైదరాబాద్లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో, నాగ చైతన్య తన భాగస్వామి శోభిత ధూళిపాళ్ల గురించి ప్రస్తావించారు. ఈ సినిమాలో “బుజ్జి తల్లి” అనే పాట ఉండటం తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని తెలిపారు. తాను శోభితను ప్రేమగా “బుజ్జి తల్లి” అని పిలుస్తానని, ఆ పేరుతో పాట రావడం తనకు ఆనందాన్ని కలిగించిందని వ్యక్తం చేశారు. ఈ పాటను ఆమెకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. “తండేల్” శ్రీకాకుళం జిల్లాలోని డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారుల నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్‌చే బంధించబడి జైలు కెళ్లిన వారి బాధను, పోరాటాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన “తండేల్” సినిమా ఆసక్తికరమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది. నాగ చైతన్య, సాయి పల్లవి నటన, చందూ మొండేటి దర్శకత్వం ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఫిబ్రవరి 7న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను ఎంత వరకు దోచుకుంటుందో చూడాలి.